వారి రోదనను పట్టించుకోని కేంద్రం: సోనియా

ABN , First Publish Date - 2020-05-29T07:21:19+05:30 IST

వలస కార్మికుల రోదనలు దేశం మొత్తానికి వినిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ‘స్పీక్‌ అప్‌ ఇండియా’ పేరిట గురువారం కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించిన...

వారి రోదనను పట్టించుకోని కేంద్రం: సోనియా

న్యూఢిల్లీ, మే 28: వలస కార్మికుల రోదనలు దేశం మొత్తానికి వినిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ‘స్పీక్‌ అప్‌ ఇండియా’ పేరిట గురువారం కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్టు చేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7500 చొప్పున 6 నెలల పాటు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు సాయం అందించాలని కోరారు. 


Updated Date - 2020-05-29T07:21:19+05:30 IST