నేడు కేంద్ర బృందం రాక

ABN , First Publish Date - 2022-08-10T05:50:09+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రానుంది.

నేడు కేంద్ర బృందం రాక

చింతూరు, ఆగస్టు 9: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రానుంది.  కేంద్ర బృందంలోని సభ్యులు ఉదయం ఎనిమిది గంటలకు విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు రంపచోడవరం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చింతూరు చేరుకుంటారు. 1.30 నిమిషాల నుంచి 2.30 నిమిషాల వరకు భోజన విరామం. 2.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు కూనవరం మండలం, పెద్ద ఆర్కూరు, చిన్నఆర్కూరులో వరద నష్టం వివరాలను బాధితుల నుంచి సేకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు కూనవరం మండలం కోండ్రాజుపేట, శబరి కొత్తగూడెం చేరుకుని అక్కడి పరిస్థితిని అంచనా వేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 5.30 నిమిషాలకు వరరామచంద్రపురం మండలంలోని వడ్డిగూడెం, రాజుపేట, రేఖపల్లి చేరుకుని బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం 6.30 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని రాత్రికి బస చేస్తారు.

Updated Date - 2022-08-10T05:50:09+05:30 IST