CIFNETలో ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-07-01T21:00:24+05:30 IST

కొచ్చిన్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌(Central Institute of Fisheries Nautical and Engineering Training)(సిఫ్‌నెట్‌) - డిగ్రీ ప్రోగ్రామ్‌, ట్రేడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

CIFNETలో ప్రోగ్రామ్‌లు

కొచ్చిన్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ట్రెయినింగ్‌(Central Institute of Fisheries Nautical and Engineering Training)(సిఫ్‌నెట్‌) - డిగ్రీ ప్రోగ్రామ్‌, ట్రేడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌(నాటికల్‌ సైన్స్‌) ప్రోగ్రామ్‌, వెసల్‌ నేవిగేటర్‌ కోర్సు(వీఎన్‌సీ)/ మెరైన్‌ ఫిట్టర్‌ కోర్సు(ఎంఎఫ్‌సీ) అందుబాటులో ఉన్నాయి. కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌ (నాటికల్‌ సైన్స్‌)

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి.  నాటికల్‌ సైన్స్‌, ఫిషరీ బయాలజీ, ఫిషింగ్‌ క్రాఫ్ట్‌ టెక్నాలజీ, ఫిషింగ్‌ గేర్‌ తదితర అంశాలు బోధిస్తారు.  ఫిషింగ్‌ వెసెల్స్‌ మీద ఇంటిగ్రేటెడ్‌ ప్రాక్టికల్‌, ఆన్‌ బోర్డ్‌ ట్రెయినింగ్‌లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ కొచ్చి క్యాంప్‌సలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్‌నకు యూజీసీతోపాటు ముంబైలోని డీజీ షిప్పింగ్‌ గుర్తింపు ఉంది.  మొత్తం 45 సీట్లు ఉన్నాయి. వీటిలో ఎన్‌ఆర్‌ఐలకు 1, విదేశీయులకు 1, లేటరల్‌ ఎంట్రీకి 5 సీట్లు ప్రత్యేకించారు.

అర్హత:  గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎంపీసీ/ బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సంస్థ నిర్వహించే వెసెల్‌ నేవిగేటర్‌ కోర్సు పూర్తిచేసుకొన్న అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ కింద ప్రోగ్రామ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థుల వయసు అక్టోబరు 1 నాటికి 17 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. లేటరల్‌ ఎంట్రీకి 22 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250

ఎంట్రెన్స్‌ టెస్ట్‌  కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 23 


వెసెల్‌ నేవిగేటర్‌ కోర్సు (వీఎన్‌సీ)/ మెరైన్‌ ఫిట్టర్‌ కోర్సు (ఎంఎఫ్‌సీ)

ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. వీటిలో కూడా ప్రాక్టికల్‌, ఆన్‌ బోర్డ్‌ ట్రెయినింగ్‌ ఉంటాయి. ఈ కోర్సులను ఎన్‌సీవీటీ  క్రాఫ్ట్స్‌మన్‌ ట్రెయినింగ్‌  స్కీం కింద డీజీఈటీ - న్యూఢిల్లీ నిర్వహిస్తోంది. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం క్యాంప్‌సలలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో క్యాంప్‌సలో ఒక్కో కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. ప్రతి క్యాంప్‌సలో కోర్సుకు నాలుగు సీట్లను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్‌ చేస్తాయి. 

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలనుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మేథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులలో ఒక్కోదానిలో 40 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. 

స్టయిపెండ్‌: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1500 చెల్లిస్తారు. కోర్సులు పూర్తిచేసుకొన్నవారికి పోస్ట్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రెయినింగ్‌ ఉంటుంది. ఈ ట్రెయినింగ్‌ సమయంలో నెలకు రూ.20,500లతోపాటు యూనిఫాం అలవెన్స్‌ రూ.2,500లు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా, పట్నా

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 16


ముఖ్య సమాచారం

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 5

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్‌, సిఫ్‌నెట్‌, ఫైన్‌ఆర్ట్స్‌ అవెన్యూ, కొచ్చి - 682016

దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన వెబ్‌సైట్‌: bharatkosh.gov.in 

సంస్థ వెబ్‌సైట్‌: www.cifnet.gov.in

Updated Date - 2022-07-01T21:00:24+05:30 IST