‘రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు’

ABN , First Publish Date - 2020-12-05T05:53:19+05:30 IST

రైతు ప్రభుత్వాలు అంటూ గొప్పలు చెప్పు కుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత అన్నారు. శుక్రవారం రూరల్‌ మండలంలోని పందిర్‌లొద్ది, మాలేబోరిగాం, చిన్నమల్లె బోరిగామ్‌, ధర్మగూడ, కేబీ కాలనీ, టేకిడిగూడ పలు గ్రామాల్లో పర్యటించారు.

‘రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు’

ఆదిలాబాద్‌రూరల్‌, డిసెంబరు 4: రైతు ప్రభుత్వాలు అంటూ గొప్పలు చెప్పు కుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత అన్నారు. శుక్రవారం రూరల్‌ మండలంలోని పందిర్‌లొద్ది, మాలేబోరిగాం, చిన్నమల్లె బోరిగామ్‌, ధర్మగూడ, కేబీ కాలనీ, టేకిడిగూడ పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ 18, 19 సంవత్సరాలకు సంబంధించిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ డబ్బులు రైతులు చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇంత వరకు చెల్లించకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపిచారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే రైతుబంధు డబ్బులు ఇచ్చి, మిగతా ప్రాంతాల్లో రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు హామీలు ఇవ్వకుండానే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏకదాటిగా రైతులకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని, ఎక్కడ మాత్రం డబులు బెడ్‌రూం ఇండ్లు కనబడడం లేదన్నారు. త్వరలో నిర్వహించే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి టీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లూరి సంజీవ్‌రెడ్డి, కొండగంగాధర్‌, ఆరే.పొచ్చన్న, ఆనంద్‌రావ్‌, కైలాస్‌, రూపెష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:53:19+05:30 IST