కావలి : కొత్తపల్లి చెరువులో ఉపాధి పనులు పరిశీలిస్తున్న కేంద్ర బృందం
పలుచోట్ల పనుల పరిశీలన
కావలి, జూలై 4 : కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో సోమవారం కేంద్ర బృందం సుడిగాలి పర్యటన చేసింది. పలు చోట్ల ఉపాధి హామీ, తదితర పనులు పరిశీలించారు. కావలి మండలం కొత్తపల్లి చెరువులో ఉపాధిహామీ పనులను కేంద్ర బృందం డైరెక్టర్ రవీంద్రన్ పరిశీలించారు. జలజీవన్ అభియాన్ కింద చేసిన పనులు, నీటినిల్వ గుంటలు, పనులకు సంబంధించిన నేమ్ బోర్డులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు.