సెస్‌లో Doctoral Fellowship

ABN , First Publish Date - 2022-07-01T20:32:55+05:30 IST

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(Center for Economic and Social Studies) (సెస్‌)- ఫుల్‌ టైం ఫెలోషిప్‌(Full Time Fellowship) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

సెస్‌లో Doctoral Fellowship

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(Center for Economic and Social Studies) (సెస్‌)- ఫుల్‌ టైం ఫెలోషిప్‌(Full Time Fellowship) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చ్‌ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) నిర్వహిస్తున్న ‘ఇన్‌స్టిట్యూషనల్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్స్‌ స్కీం’ కింద ఫెలోషిప్‌లు అందిస్తారు. ఫెలోషిప్‌ వ్యవధి రెండేళ్లు. ఫెలోషిప్‌ కింద నెలకు రూ.20,000లు, కంటింజెన్సి గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు సెస్‌లో ఫుల్‌ టైం స్కాలర్‌గా, సెస్‌ ఫ్యాకల్టీ మెంబర్‌ వద్ద రిసెర్చ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేయాల్సి ఉంటుంది.   


ఫెలోషిప్‌ విభాగాలు

ఎకనామిక్స్‌, సోషియాలజీ, సోషల్‌ ఆంత్రోపాలజీ, పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషల్‌ జాగ్రఫీ/ పాపులేషన్‌ స్టడీస్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, డెవల్‌పమెంట్‌ స్టాటిస్టిక్స్‌ 


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సోషల్‌ సైన్స్‌ విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో కనీసం 45 శాతం, పీజీ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/ డీమ్డ్‌ యూనివర్సిటీలు/ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌/ ఐసీఎ్‌సఎ్‌సఆర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎంఫిల్‌ డిగ్రీ ఉన్నవారికి, యూజీసీ నెట్‌/ స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. యూజీసీ జేఆర్‌ఎఫ్‌/ రాజీవ్‌గాంధీ డాక్టోరల్‌ ఫెలోషిప్‌/ మౌలానా ఆజాద్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 8 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డీన్‌, డివిజన్‌ ఫర్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌(డీజీఎస్‌), సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌ - 500016

వెబ్‌సైట్‌: www.cess.ac.in

Updated Date - 2022-07-01T20:32:55+05:30 IST