గిరిజనుల సంక్షేమానికి కేంద్రం కృషి

ABN , First Publish Date - 2022-07-03T05:20:55+05:30 IST

గిరిజనుల సంక్షేమానికి కేంద్రం కృషి

గిరిజనుల సంక్షేమానికి కేంద్రం కృషి
దావుత్‌గూడలో మహిళలతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సాధ్వీనిరంజన్‌ జ్యోతి

  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీనిరంజన్‌ జ్యోతి
  • దావుత్‌గూడ నాయకుడి ఇంట్లో అల్పాహారం

కందుకూరు, జూలై 2: గిరిజన ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా తండాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీనిరంజన్‌ జ్యోతి అన్నారు. మంత్రి శనివారం కందుకూరు మండలం దావుత్‌గూడలో బీజేపీ బూత్‌ కమి టీ నాయకుడు ఆర్‌.వెంకట్రాం ఏర్పాటు చేసిన అల్పాహార విందు లో పాల్గొన్నారు. అనంతరం తండా వాసులతో ఆమె మాట్లాడారు. పేదల సమస్యలను ప్రధామంత్రి నరేంద్రమోదీ పూర్తిగా అవగాహ న చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన నిధుల ను మంజూరు చేస్తున్నారని తెలిపారు. దేశ సంస్కృతిలో అన్ని మతాలు, కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థినిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మూను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపికచేయడం గర్వకారణమన్నారు. అం తకు ముందు గ్రామ మహిళలు మంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ మం ద జ్యోతి, నాయకులు పాపయ్యగౌ డ్‌, శ్రీరాములయాదవ్‌, సుదర్శన్‌రెడ్డి, కొలను శంకర్‌రెడ్డి, స్వామిగౌడ్‌, ఎంపీటీసీ రాజమ్మ, లీలరవి, దేశ్యా, శ్రీనివాస్‌, నిమ్మ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  • అధికారమే లక్ష్యంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలి


  • బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ పిలుపు

షాద్‌నగర్‌ అర్బన్‌: అధికారమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ పిలుపునిచ్చారు. విజయ సంకల్ప సభకు షాద్‌నగర్‌ ఇన్‌చార్జిగా వచ్చిన ఆయన శనివారం షాద్‌నగర్‌ ఏబీ కాంప్లెక్స్‌లో బీజే పీ, అనుబంధ శాఖల ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అధినాయకత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని, అందుకు కార్యకర్తలు కూడా తమవంతు కృషిచేయాలని కోరారు. సాగుకు భూమిని  చదును చేసినట్టుగానే ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలు బాట వేసేందుకు శ్రమించాలన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే బీజేపీ విజయ్‌ సంకల్ప్‌ సభకు ప్రతీ కార్యకర్త తరలిరావాలని ఈ సందర్భంగా ఆర్పీ సింగ్‌ పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త సైతం అత్యన్నత స్థాయికి ఎదిగే అవకాశం బీజేపీలోనే ఉందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సైతం ఒకనాటి కార్యకర్తలేనని, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సైతం ఆదివాసి మహిళ అని గుర్తు చేశా రు. పార్టీ విజయానికి పనిచేసే వారికి బీజేపీ గుర్తింపు ఇస్తుందన్నారు. సమావేశంలో నాయకులు పాపయ్యగౌడ్‌, దేపల్లి అశోక్‌గౌడ్‌, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కక్కునూరి వెంకటే్‌షగుప్తా, కమ్మరి భూపాలాచారి, టి.విజయ్‌కుమార్‌, పాతపల్లి కృష్ణారెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింహాగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:20:55+05:30 IST