Abn logo
Aug 26 2021 @ 16:08PM

Viral Video: ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తుండగా షాకింగ్ ఘటన.. సడన్‌గా ఊడిపడిన ఫ్యాన్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్:  ఎప్పటిలాగే కుటుంబమంతా ఆ రోజూ భోజనానికి కూర్చుంది. కంచాలు, గిన్నెలు మధ్యలో పేర్చి..కుటుంబసభ్యులు వాటి చుట్టూరా కూర్చున్నారు. పిల్లలు, పెద్దలూ అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు.  ఇంతలో ఏదో అలికిడి.. దీంతో అక్కడే ఉన్న ఓ చిన్న కుర్రాడు తల పైకెత్తి చూశాడు. కానీ..అతడికి ఏం అర్థం కాలేదు. అలాగే కొన్ని క్షణాలు పైకెత్తే చూశాడు. అక్కడున్న వారందరూ ఆ శబ్దాన్ని విన్నారు! అయితే.. ఏదో శబ్దం అయ్యి ఉంటుందిలే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో..పైనున్న సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి కిందపడింది. మరి ఆ టైంలో వారిపై ఏ దేవుడు దయచూపాడో గానీ.. చిన్న పిల్లాడి తలకు నేరుగా తగలాల్సిన ఫ్యాన్ కొద్దిగా పక్కకు పడింది. వాటి రెక్కల మధ్య అతడి తల..! ఈ సీన్ చూడగానే..అక్కడే ఉన్న మహిళకు గుండె ఆగినంతపనైంది.

వెంటనే ఆమె లేచి పరిగెత్తుకు వచ్చి..ఆ చిన్నపిల్లాడికి దెబ్బలేమైనా తగిలాయేమోనని చూసింది. తలను నిమిరింది. వియత్నాంలో ఓ కుటుంబం ఇటీవల ఎదుర్కొన్న భయానక పరిస్థితి ఇది.  అదృష్టవశాత్తూ ఆ కుటుంబంలో ఎవరికీ దెబ్బలు తగలలేదు. సీలింగ్ ఫ్యాన్లు అకస్మాత్తుగా ఊడి కిందపడటం చాలా అరుదు. కానీ..అది జరిగితే..ఎంతటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తెగ భయపడిపోతున్నారు. చిటికెలో పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అలాగే చాలా కుటుంబాలు ఇలా ఫ్యాన్ కింద కూర్చుని భోజనం చేస్తాయి. కాబట్టి..సహజంగానే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లాడికి ఏ ప్రమాదమూ జరగక పోవడం నిజంగా అద్భుతమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 


ప్రత్యేకంమరిన్ని...