నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-05-25T03:45:56+05:30 IST

నేరాల నియంత్రణకే సీసీ కెమెరా లను ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరా లను పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎమ్మెల్యే దివా కర్‌రావుతో కలిసి కమిషనర్‌ ప్రారంభించారు. కమి షనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు.

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి

ఏసీసీ, మే 24: నేరాల నియంత్రణకే సీసీ కెమెరా లను ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరా లను పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎమ్మెల్యే దివా కర్‌రావుతో కలిసి కమిషనర్‌ ప్రారంభించారు. కమి షనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు. మం చిర్యాల పట్టణ అభివృద్ధితోపాటు నేరాల సంఖ్య పెరు గుతుందని, గతంలో ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి మంచిర్యాలలో నేరాలకు పాల్పడ్డ సం ఘటనలు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలకు పాల్పడిన వ్యక్తులను పట్టుకోవడం ఎంతో సులువైందన్నారు. స్థానిక సంస్థలు, వ్యాపార వేత్తలు, విద్యాసంస్థలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పా టుకు సహకరించాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజా యిని అరికట్టడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరం తరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీ సులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్‌ నేరాలు జరగకుండా ఉండడానికి ప్రజలకు అవగాహన కల్పి స్తామన్నారు. 

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ క్రైం వారియర్స్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్‌ నేరాల దర్యాప్తునకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌ రావు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల నేరాలు తగ్గుతాయని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.15 లక్షల నిధులతో 75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏసీ పీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణనాయక్‌, ట్రాఫిక్‌ సీఐ నరేష్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T03:45:56+05:30 IST