Abn logo
Jun 23 2021 @ 00:04AM

సీసీ కెమెరాలుంటే నేరాలు తగ్గుతాయి

డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అర్వింద్‌బాబు
జక్రాన్‌పల్లి, జూన్‌ 22: గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొ ంటే నేరాలు, దొంగతనాలు తగ్గుతాయని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అర్వింద్‌బాబు అన్నారు. మంగళవారం మండలంలోని అర్గుల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. సీసీ కెమె రాల ప్రారంభానికి ముందు వెంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో ఆ యన మొక్క నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో డీసీపీ మాట్లా డుతూ.. ప్రస్తుత ఆధునికకాలంలో సీసీ కెమెరాలు నిఘా నేత్రాల్లాంటివ ని ఈ కెమెరాలను కాపాడుకొని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు గ్రా మ ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ సీసీ కెమెరాలు పోలీసు శాఖ ఆధీనంలో నడుస్తాయన్నారు. శాంతి భద్రతలకు ప్రజలు పోలీసులకు స హకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గోర్తె పద్మ, ఉప సర్పంచ్‌ రాజేందర్‌, వీడీసీ చైర్మన్‌ సదానంద్‌ యాదవ్‌, ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ రఘునాథ్‌, ఎస్సై సాయిరెడ్డి, ఏఎస్సై శ్రీనివాస్‌ పాల్గొన్నారు.