Abn logo
Nov 22 2020 @ 00:11AM

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం

  • కుషాయిగూడ ఏసీపీ శివ కుమార్‌ 

కీసర: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ అన్నారు. శనివారం మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీకెమెరాలను ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ పుటేజీ ఆధారాలతో అనేక కేసులను ఛేదిస్తున్నట్లు వివరించారు. నేరస్థులను   పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసే విధంగా గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిడిచెట్టి పెంటయ్య, సీఐ నరేందర్‌ గౌడ్‌, డీఐ సుదీర్‌కృష్ణ, ఉపసర్పంచ్‌ భాగమ్మ, ఎంపీటీసీ ప్రమీలా, ఎస్‌ఐలు రమేష్‌, రామాసూర్యం, లతో పాటు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement