మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి

ABN , First Publish Date - 2021-08-18T21:35:58+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది.

మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. భాస్కర్‌రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా మరోసారి సీబిఐ బృందం విచారిస్తోంది. భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు. ఇప్పటికే  హైకోర్టుకు, ఢిల్లీలో సీబీఐ అధికారులకు తన తండ్రి హత్య కేసులోని 15 మంది అనుమానితుల లిస్టును సునీత ఇచ్చారు. వీరిలో ప్రధానంగా వైఎస్ భాస్కర్‌రెడ్డి పేరు ఉన్నట్లు సమాచారం.


భాస్కరరెడ్డితో పాటు ఆయన సోదరుడు వైఎస్‌ మనోహర్‌రెడ్డిలను అధికారులు మంగళవారం పులివెందుల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సుదీర్ఘంగా విచారించారు. భాస్కరెడ్డిని తొలుత ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 2.10గంటల వరకు విచారించారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు రెండోవిడత విచారణకు హాజరయ్యారు. ఆయన సోదరుడు మనోహర్‌రెడ్డిని మధ్యా హ్నం 2.30నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు చిన్నాన్నలు అవుతారు. 


Updated Date - 2021-08-18T21:35:58+05:30 IST