సుశాంత్‌ ఆత్మహత్య కేసులో.. రియా చక్రవర్తి నిందితురాలు

ABN , First Publish Date - 2020-08-07T08:08:05+05:30 IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి, మరో ఐదుగురిని నిందితులుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేసింది. సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన బిహార్‌ పోలీసులు కేసును సీబీఐకి బదిలీ చేశారు...

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో.. రియా చక్రవర్తి నిందితురాలు

  • మరో ఐదుగురిపైనా సీబీఐ అభియోగాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 6: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి, మరో ఐదుగురిని నిందితులుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేసింది. సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన బిహార్‌ పోలీసులు కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బిహార్‌ సర్కారు కూడా కేం ద్రాన్ని కోరింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా, అగస్టా వెస్ట్‌లాండ్‌ చాపర్‌ ఒప్పందం కుంభకోణం తదితర కేసులను దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందానికి సుశాంత్‌ కేసు ను అప్పగించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. డీఐజీ గగన్‌దీప్‌ గంభీర్‌, జేడీ మనోజ్‌ శశిధర్‌ల పర్యవేక్షణలో ఎస్పీ నూ పూర్‌ ప్రసాద్‌ ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, కుట్ర, దొంగతనం, మోసం, అక్రమ నిర్బంధం, బెదిరింపు తదితర అభియోగాలను రియా, మరో ఐదుగురిపై సీబీఐ మోపింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జూన్‌ 14న విగత జీవిగా కనిపించిన 34 ఏళ్ల సుశాంత్‌ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు తేల్చారు. అదే సందర్భంలో సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుతో బిహార్‌ పోలీసులు విచారణ చేపట్టారు. రాజకీయ, సినీవర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పోలీసులు సీబీఐకి అప్పగించారు. తనపై ఆరోపణలను ఖండించిన రియా చక్రవర్తి కూడా కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హవాలా, ఆర్థిక అక్రమాలపై ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. 


Updated Date - 2020-08-07T08:08:05+05:30 IST