వేలిముద్రలతో పిల్లి బొమ్మ!
ABN , First Publish Date - 2022-06-09T05:36:13+05:30 IST
బొటనవేలును పసుపు రంగులో ముంచి వైట్ షీట్‌పై వేలిముద్ర వేయాలి.
కావలసినవి
పసుపు రంగు పెయింట్, బ్లాక్ మార్కర్, వైట్ షీట్
బొటనవేలును పసుపు రంగులో ముంచి వైట్ షీట్‌పై వేలిముద్ర వేయాలి.
బొమ్మలో చూపిన విధంగా బొటనవేలు వేలిముద్రకు కాస్త పైన చూపుడు వేలుతో వేలిముద్ర వేయాలి.
బ్లాక్ మార్కర్ సహాయంతో కళ్లు, చెవులు, ముక్కు, నోరు, మీసాలు గీయాలి.
కాళ్లు, తోక గీయాలి.
వీపుపైన, తలపైన కొన్ని చారలు గీస్తే పిల్లి బొమ్మ రెడీ.