రెండు ముఖాలతో జన్మించిన పిల్లి.. వైరలవుతున్న పోటోలు

ABN , First Publish Date - 2020-05-25T01:15:53+05:30 IST

అమెరికాలోని ఓ పిల్లి ఇటీవల ఓ బుల్లి పిల్లికి జన్మనిచ్చింది. పిల్లి మరో పిల్లికి జన్మనివ్వడంలో విచిత్రమేముంది..

రెండు ముఖాలతో జన్మించిన పిల్లి.. వైరలవుతున్న పోటోలు

వాషింగ్టన్: అమెరికాలోని ఓ పిల్లి ఇటీవల ఓ బుల్లి పిల్లికి జన్మనిచ్చింది. పిల్లి మరో పిల్లికి జన్మనివ్వడంలో విచిత్రమేముంది..? అయినా బుల్లి పిల్లి కాకపోతే పెద్ద పిల్లి పుడుతుందా..? ఇలాంటి ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే ఇక్కడ పుట్టింది ఒక్క పిల్లే అయినప్పటికీ దానికి రెండు ముఖాలున్నాయి. ప్రస్తుతం ఈ నవజాత పిల్లికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని ఓరెగాన్ అనే ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ పిల్లి జన్మించింది. ఇలా రెండు తలలతో జన్మించిన పిల్లులను ‘జానస్ క్యాట్’ అని అమెరికన్లు పిలుస్తారు. ఇదిలా ఉంటే ఈ పిల్లికి దాని యజమానులు బిస్కట్స్, గ్రేవీ అని పేర్లు పెట్టారు. ఈ పిల్లికి రెండు ముక్కులు, రెండు నోర్లు, నాలుగు కళ్లు ఉన్నప్పటికీ, మెదడు మాత్రం ఒక్కటే ఉందని డాక్టర్లు చెప్పినట్లు వారు తెలిపారు. తమ పిల్లికి సంబంధించిన ఫోటోలను అనేకం సోషల్ మీడియాలో షేర్ చేశామని, అవి తెగ వైరల్ అవుతున్నాయని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-05-25T01:15:53+05:30 IST