ఇంటింటి సర్వేలోనూ వెలుగుచూస్తున్న కేసులు

ABN , First Publish Date - 2021-05-15T06:20:11+05:30 IST

జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టులతో వచ్చే కేసులే కాకుండా ఇంటింటి ఆరోగ్య సర్వేలోనూ కొత్త కేసులు వస్తున్నాయి. జిల్లాలో పాజిటివ్‌ కేసులతో పాటు ఈ సర్వే ద్వారా ఊ హించని రీతిలో జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలున్న వా రు వెలుగులోకి వస్తున్నారు.

ఇంటింటి సర్వేలోనూ వెలుగుచూస్తున్న కేసులు
ఆర్మూర్‌ పట్టణంలో సర్వే నిర్వహిస్తున్న ఆశ వర్కర్‌లు, మున్సిపల్‌ సిబ్బంది (ఫైల్‌)

ఇప్పటికే భారీగా నమోదైన కేసులు
అందరికీ హోం ఐసోలేషన్‌ కిట్ల అందజేత
ఆసుపత్రులలో తగ్గని కొవిడ్‌ బాధితులు
కొనసాగుతున్న రెండో విడత టీకా పంపిణీ
నెలాఖరు తర్వాతే ఫస్ట్‌ డోసు టీకా

నిజామాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టులతో వచ్చే కేసులే కాకుండా ఇంటింటి ఆరోగ్య సర్వేలోనూ కొత్త కేసులు వస్తున్నాయి. జిల్లాలో పాజిటివ్‌ కేసులతో పాటు ఈ సర్వే ద్వారా ఊ హించని రీతిలో జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలున్న వా రు వెలుగులోకి వస్తున్నారు. వీరిలో కొంత మందికి స్వ ల్ప లక్షణాలు ఉండడంతో సర్వే ద్వారా బయట పడుతు న్న వారందరికీ మందుల  కిట్లను ఇస్తున్నారు. అందరి నీ హోంఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో మొత్తం ఇళ్ల సర్వే పూర్తి కానుండటంతో ఇంకా కొంతమంది లక్షణాలు ఉన్నవారు బయటపడతా రని వైద్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


పది రోజులుగా కొనసాగుతున్న సర్వే
జిల్లాలో గత పది రోజులుగా జ్వరం, కొవిడ్‌ లక్షణా లు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేస్తు న్నారు. జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో కలి పి మొత్తం 1,204 బృందాలను ఏర్పాటు చేసి వారి ద్వా రా ప్రతీరోజు ఈ సర్వే చేస్తున్నారు. జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 4 లక్షల 8 వేల 165 ఇ ళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 3 లక్షల 80 వేల 345 ఇళ్లను సర్వే చేశారు. ప్రతీ ఇంటికి ఈ బృందాలు వెళ్లి జ్వరం, దగ్గు, ఇతర సమస్యలు ఉన్నవారిని గుర్తిస్తు న్నారు. వారికి అదే రోజు మందులు ఇస్తున్నారు. తగ్గేం తవరకు హోంఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. ప్రతీరోజు జరిగే కొవిడ్‌ పరీక్షలకు అదనంగా ఈ సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 10,225 మందిని ఈ సర్వే ద్వారా జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి కొవి డ్‌ పరీక్షలు అవసరం లేదని తెలిపారు. అందరూ ఇం ట్లో ఉండాలని కోరారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సమీప పీహెచ్‌సీలకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి పంపిస్తారని సర్వేకు వెళ్లిన వారు వివరిస్తున్నారు.


 వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులు
జిల్లాలో కరోనా టెస్టులు చేస్తూనే ఈ సర్వేను నిర్వ హిస్తుండగా లక్షణాలు ఉన్నవారు బయటకు వవస్తుండడంతో కేసులు తగ్గుతాయని అధికారులు అంచనావే స్తున్నారు. జిల్లాలో శుక్రవారం కూడా టెస్టుల ద్వారా రెండు వందల కేసులు వచ్చాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు ఇరవై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జి ల్లాలో రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు 2 లక్షల 97 వేల 482 పరీక్షలు నిర్వహించగా 33,688 కేసులు న మోదయ్యాయి. మొదటి విడతతో పోల్చితే రెండో విడత లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల నమో దు పెరిగింది. రెండో విడతలో మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జిల్లాలో కొవిడ్‌ పరీక్షలకు సమాంత రంగా ఈ సర్వేను నిర్వహించారు. బాధితులకు అవసర మైన సేవలను వారి పరిధిలోని పీహెచ్‌సీల ద్వారా   అందించేందుకు ఏర్పాట్లు చేశారు.


కొవిడ్‌ బాధితులకు చికిత్స కోసం ఏర్పాట్లు
జిల్లాలో కొవిడ్‌ టెస్టులు సర్వేతో పాటు చికిత్సకు ఏ ర్పాట్లను పెంచారు. ఆసుపత్రులలో ఇప్పటికి కొవిడ్‌ పాజిటివ్‌ సం ఖ్య ఇంకా తగ్గలే దు. అన్ని ఆసుపత్రుల లో ఇప్పటికీ భారీగా కొవిడ్‌ చికి త్స పొందుతున్నారు. జనరల్‌లో 345 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుప త్రిలో గత వారం వరకు 715 మంది వరకు చికిత్స పొందారు. అందరూ సమన్వయంతో పనిచేయడం వల్ల మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లతో పాటు ఆక్సిజన్‌ కొ రత రాకుండా ఏర్పాట్లు చేశారు. వైద్యులతో పాటు నా లుగో తరగతి ఉద్యోగుల కొరత ఏర్పడుతున్నా సమీకరి స్తూ సేవలు అందిస్తున్నారు. బోధన్‌, ఆర్మూర్‌ ఆసుప త్రులలో మరో వంద మంది వరకు ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఇంకా చాలా మందే చికిత్స పొందు తున్నారు. ప్రైవేటులో ఫీజులు, మందులకు భారీగా వ సూలు చేసినా ప్రస్తుతం తగ్గింది.


కొనసాగుతున్న రెండో విడత టీకా పంపిణీ
జిల్లాలో ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు, చికిత్స చేస్తూనే టీకాలు కూడా వేస్తున్నారు. అయితే, మొదటి విడత టీ కా వేసుకున్న వారికి మాత్రమే సెకండ్‌ డోసు టీకా వే స్తున్నారు. జిల్లాలో శుక్రవారం రంజాన్‌ పండుగ ఉండ డంతో కేవలం 204 మందికే సెకండ్‌ డోసు టీకా  వేశా రు. అంతేకాకుండా ఈనెల చివరి వరకు రెండో డోసు మాత్రమే వేయనున్నారు. రాష్ట్రానికి టీకా సరఫరా పెర గగానే మళ్లీ కొత్త వారికి వేస్తారని జిల్లా వ్యాక్సి నేషన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. ప్రస్తుతం అంద రికీ రెండో డోసు ఇస్తున్నామని తెలిపారు. రెండో డోసు తీసుకునే వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-05-15T06:20:11+05:30 IST