‘లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం’

ABN , First Publish Date - 2022-06-27T05:44:46+05:30 IST

ఆత్మకూరు న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో 300 కేసులను పరిష్కరించినట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరావు తెలిపారు.

‘లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం’
బనగానపల్లెలో లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న జడ్జి కిశోర్‌కుమార్‌

ఆత్మకూరు, జూన్‌ 26: ఆత్మకూరు న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో 300 కేసులను పరిష్కరించినట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 6 సివిల్‌ కేసులు, 106 క్రిమినల్‌, 9 మున్సిపల్‌ ఆఫీసు ప్రిలిటిగేషన్‌ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే 6 యూనియన్‌ బ్యాంకు ప్రిలిటిగేషన్‌ కేసు, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు కేసులు 173 పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు.


బనగానపల్లె: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ఆదివారం బనగానపల్లె సివిల్‌కోర్టు  ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 208 కేసులు పరిష్కరించినట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి కిశోర్‌కుమార్‌ తెలిపారు. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, నందివర్గం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 64 క్రిమినల్‌ కేసులు రాజీ అయినట్లు తెలిపారు. 138 సమ్మర్‌ ట్రయల్‌ కేసులకు గాను రూ.1.75 లక్ష జరిమానా విఽధించినట్లు తెలిపారు. 3 సివిల్‌ తగాదాల కేసులు, ఒక భరణం కేసు, 3 గృహహింస కేసులు, పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గోపాలకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, సెక్రటరీ నరసింహారెడ్డి, న్యాయవాదులు శ్రీనివాసమూర్తి, అజామ్‌హుస్సేన్‌, ఖాజాహుస్సేన్‌, అల్లావుద్దీన్‌ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:44:46+05:30 IST