పరీక్షలు చేస్తే భారత్‌, చైనాల్లో భారీగా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T08:06:07+05:30 IST

భారత్‌, చైనా లాంటి దేశాలు మరిన్ని కొవిడ్‌ పరీక్షలు చేస్తే తమ దేశం కన్నా ఎక్కువ కరోనా వైరస్‌ కేసులు బయట పడేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

పరీక్షలు చేస్తే భారత్‌, చైనాల్లో భారీగా కేసులు

అమెరికా గణాంకాలనూ దాటేస్తారు

కొవిడ్‌పై విజయం సాధించాం: ట్రంప్‌


వాషింగ్టన్‌, జూన్‌ 6: భారత్‌, చైనా లాంటి దేశాలు మరిన్ని కొవిడ్‌ పరీక్షలు చేస్తే తమ దేశం కన్నా ఎక్కువ కరోనా వైరస్‌ కేసులు బయట పడేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా ఇప్పటివరకు రెండు కోట్ల పరీక్షలు చేసిందని, అందుకే ప్రపంచంలోకెల్లా అత్యధిక కేసులు తమ దేశంలో నమోదయ్యాయని చెప్పారు. అత్యధిక పరీక్షలు చేసినట్లుగా పేరు తెచ్చుకున్న జర్మనీ, దక్షిణ కొరియాల్లో కూడా 40 లక్షలు, 30 లక్షల చొప్పున పరీక్షలు చేశారని వెల్లడించారు. అమెరికాలో 19 లక్షల కేసులు, 1,09,000 మరణాలు నమోదయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న భారత్‌, చైనాల్లో 2.36 లక్షలు, 84 వేల కేసుల చొప్పున నమోదయ్యాయి. భారత్‌ ఇప్పటిదాకా కేవలం 40 లక్షల పరీక్షలు చేసింది. కరోనా పరీక్షలు చేసే కిట్లను తయారుచేసే ప్యూరిటన్‌ మెడికల్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీని సందర్శించిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. 


20 లక్షల డోసుల వ్యాక్సిన్‌ సిద్ధం

అమెరికా దగ్గర 20 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉందని ట్రంప్‌ ప్రకటించారు. వాటిని పరీక్షించడమే మిగిలిందన్నారు. అమెరికా సర్కారు ఆధ్వర్యంలో కనుగొన్న వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవకాశాన్ని ఐదు ప్రయివేటు కంపెనీలకు ఇవ్వనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. కరోనా విలయంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన 83 లక్షల మం దిలో 25 లక్షల మందికి మే నెలలో తిరిగి ఉద్యోగాలు దొరికాయి. అయితే, ఇప్పటికీ నిరుద్యోగిత రేటు 13.3ు ఉంది. 

Updated Date - 2020-06-07T08:06:07+05:30 IST