మద్యం,సారా తరలిస్తున్న వారిపై కేసులు

ABN , First Publish Date - 2020-05-29T11:27:33+05:30 IST

జిల్లాలో వేర్వేరుచోట్ల అక్రమంగా మద్యం, సారాను తరలిస్తున్న వారిని పోలీసు లు అరెస్టు చేశారు. సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను ఎక్సైజ్‌ ..

మద్యం,సారా తరలిస్తున్న వారిపై కేసులు

జీలుగుమిల్లి/టి.నరసాపురం/బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం, మే 28 : జిల్లాలో వేర్వేరుచోట్ల అక్రమంగా మద్యం, సారాను తరలిస్తున్న వారిని పోలీసు లు అరెస్టు చేశారు. సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను ఎక్సైజ్‌ పోలీసులు ధ్వంసం చేశారు. కామయ్యపాలెం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.విశ్వనాథ్‌ తెలి పారు. ద్విచక్ర వాహనంపై తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోపాలపు రానికి రూ.17,400 విలువైన మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు. అక్రమంగా సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని టి.నరసాపురం ఎస్‌ఐ పసుపులేటి ప్రేమరాజు తెలిపారు.


పెదవేగి మండలం రామచంద్రపురానికి చెందిన ఇద్దరు మండలం నుంచి అక్రమంగా సారా తీసుకె ళ్తుండగా టి.నరసాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17 లీటర్ల సారా, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసు కుని కేసు నమోదు చేశామన్నారు. బుట్టాయ గూడెం మండలం ముద్దప్పగూ డెం, రాజానగరం గ్రామాల్లో సారా తయారు చేస్తున్న ప్రాంతాల్లో ఎక్సైజ్‌ దాడు లు నిర్వహించి 2,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. జంగారెడ్డిగూడెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ  అజయ్‌కుమార్‌సింగ్‌ గురువారం విలేకరుల తో మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలంలో సిరిబత్తుల సత్యనారాయణ  వద్ద నుంచి 30 లీటర్ల సారా, ద్విచక్ర వాహనాన్ని సాధీన పర్చుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మట్ట దుర్గాప్రసాద్‌ వద్ద తెలంగాణకు చెందిన 40 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2020-05-29T11:27:33+05:30 IST