ఆంక్షలు ఉల్లంఘించిన వెయ్యి మందిపై కేసులు

ABN , First Publish Date - 2020-03-31T09:37:25+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి విధించిన ఆంక్షలను అతిక్రమించిన వెయ్యి మందిపై కేసులు నమోదు చేసినట్టు రూరల్‌ జిల్లా ఎస్పీ బాబూజీ తెలిపారు. సోమవారం ఆయన ఏఎస్పీ

ఆంక్షలు ఉల్లంఘించిన వెయ్యి మందిపై కేసులు

నర్సీపట్నం టౌన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి విధించిన ఆంక్షలను అతిక్రమించిన వెయ్యి మందిపై కేసులు నమోదు చేసినట్టు రూరల్‌ జిల్లా ఎస్పీ బాబూజీ తెలిపారు. సోమవారం ఆయన  ఏఎస్పీ రిశాంత్‌రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరుని పరిశీలించారు. 385 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.7.45 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 690 మందిని గుర్తించామని, వీరిలో 15 మంది ఆస్పత్రుల్లో ఉన్నారని, మిగిలినవారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. జియో ట్యాగ్‌ ద్వారా వీరిపై నిఘా పెట్టడంతోపాటు ప్రత్యేక యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని బాబూజీ పేర్కొన్నారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు త్వరలో అందజేస్తామన్నారు. .


నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు

రావికమతం: నిబంధనలు ఉల్లఘించేవారిని ఉపేక్షించొద్దని, కేసులు నమోదు చేయాలని రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ ఆదేశించారు. ఆయన రావికమతం, కొత్తకోట గ్రామాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత రోడ్లపై ఎవరినీ తిరగనివ్వొద్దన స్పష్టం చేశారు. పొరుగు దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చే వారిని గుర్తించి గృహ నిర్బంధంలో ఉండేలా చూడాలన్నారు. 

Updated Date - 2020-03-31T09:37:25+05:30 IST