మాస్క్‌ లేకుండా తిరిగితే కేసు నమోదు

ABN , First Publish Date - 2021-04-13T04:33:12+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే విపత్తు నిర్వహణ చ ట్టం కింద కేసు నమోదు చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ హెచ్చరించారు.

మాస్క్‌ లేకుండా తిరిగితే కేసు నమోదు
వనపర్తిలో వాహనదారుడికి మాస్క్‌ను అందజేస్తున్న ఏఎస్పీ

- జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ 

- వాహనదారులకు మాస్క్‌లు పంపిణీ

వనపర్తి క్రైం, ఏప్రిల్‌ 12: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే విపత్తు నిర్వహణ చ ట్టం కింద కేసు నమోదు చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ హెచ్చరించారు.  సోమవా రం పట్టణంలోని రాజీవ్‌ చౌరస్తాలో ఏఎస్పీ మా స్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి జరి మానా విధించడంతో పాటు 200మందికి మాస్క్‌ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రతీ ఒ క్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా బారి న పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. ఇంటినుంచి బయటకు వెళ్లే వారు  మా స్క్‌లు ధరించాలని, బహిరంగప్రదేశంలో, షాపింగ్‌ మాల్‌లో, కూరగాయల మార్కెట్‌ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని, భౌతిక దూరం పాటించా లని సూచించారు. ప్రతీ గ్రామ పోలీస్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యువకులతో కలిసి గ్రామాల్లో మాస్క్‌ ధరించడంపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిబంధ నలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే  విపత్తు నిర్వహణ చ ట్టంలోని 51నుంచి 60 సెక్షన్లు కింద కేసులు నమో దు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ సూర్య నా యక్‌, ఎస్సై వెంకటేష్‌గౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

 సామాజిక స్పృహ ఉండాలి

కొత్తకోట: ప్రతీ ఒక్కరిలో సామాజిక స్పృహ ఉం డాలని ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం  జిల్లా ఉపాధ్యక్షు డు భీమానాయుడు ఆధ్వర్యంలో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎస్సై పా ల్గొని మాట్లాడారు. సెకండ్‌వేవ్‌ ఉదృతంగా ఉన్న సమయంలో 250మందికి మాస్క్‌లు అందించడాని కి బీమన్న ముందుకు రావడం అభినందనీయమ న్నారు. కార్యక్రమంలో హోటల్‌ రాజు, విష్ణు, వెంక టయ్యగౌడ్‌, మాసన్న, బాలస్వామి, ఉమా మహేష్‌, భరత్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T04:33:12+05:30 IST