ఈవోఆర్‌డీపై దాడి ఘటనలో ముగ్గురు పై కేసు

ABN , First Publish Date - 2021-10-20T05:03:02+05:30 IST

మండల ఈవోఆర్‌డీ శాస్ర్తీపై దాడికి పాల్పడిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.సురేష్‌ మంగళవారం రాత్రి తెలిపారు.

ఈవోఆర్‌డీపై దాడి ఘటనలో ముగ్గురు పై కేసు

కారేపల్లి అక్టోబరు 19: మండల ఈవోఆర్‌డీ శాస్ర్తీపై దాడికి పాల్పడిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.సురేష్‌ మంగళవారం రాత్రి తెలిపారు. ఎస్‌ఐ కధనం ప్రకారం  టీఆర్‌ఎస్‌  మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, మాణిక్యారం ఎంపీటీసీ సభ్యురాలు శివరాత్రి పార్వతి, ఆమె భర్త టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు అచ్చయ్య కలసి ఈనెల 13న ఎంపీడీవో కార్యాలయంలో దాడిచేశారని ఎస్‌ఐ తెలిసారు. మండల పరిధిలోని కారేపల్లి క్రాసురోడ్డులో అనుమతి లేకుండా మారెమ్మతల్లి గుడి నిర్మాణం చేస్తున్న ఎంపీటీసీ శివరాత్రి పార్వతి, ఆమె భర్త అచ్చయ్యకు హైకోర్టునుంచి నిర్మాణం నిలిపి వేయాలని నోటీసులు జారి అయ్యాయి. వచ్చిన నోటిసులను ఈవోఆర్టీడీ శాస్ర్తీ గుడి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో 12వ తేదీన గోడకు అంటించి వచ్చారు. అయితే మరుసటి రోజు అంటే 13న జడ్పీటీసీ జగన్‌ ఆధ్వర్యంలో ఆయన గదిలో ఎంపీటీసీ పార్వతి, అచ్చయ్య ఈవోఆర్డ్‌వో శాస్త్రీతో మాట్లాడలని పిలిచారని, ఆసమయంలో ఎంపీటీసీ దంపతులు తిడుతూ దాడికి ప్రయత్నం చేశారని ఎస్‌ఐ తెలిపారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న అనే వ్యక్తి గదిలోకి వచ్చి నేను ఎవరినో నేకు తెలియదా, నేను పోన్‌ చేస్తే నాపోన్‌ లిఫ్ట్‌ చేయావా అంటు తిడుతూ ఈవోఆర్డీవో దాడిచేశారని ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. మంగళవారం ఈవోఆర్‌డీ శాస్ర్తీ ఫిర్యాదు మేరకు ముగ్గురు పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-10-20T05:03:02+05:30 IST