కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి

ABN , First Publish Date - 2021-04-16T07:21:11+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశిం చారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి
ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 15 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశిం చారు. గురువారం నిర్మల్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ ప్ర క్రియను పరిశీలించారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సోన్‌, ముజ్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడేతో కలిసి పరిశీలించి వైద్యులకు పలుసూచనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, కోవిడ్‌ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఆదేశించారు. గ్రామాల వారీగా 45 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ టీకా వేసుకునేలా డాక్టర్లు, వైద్యసిబ్బంది విస్తృత అవగాహన కల్పిం చాలని సూచించారు. ప్రతీరోజూ ఎంతమందికి  వ్యాక్సిన్‌ వేస్తున్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు రెండు వందల మందికి వ్యాక్సి న్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీఒక్కరూ మాస్క్‌, భౌతిక  దూరం పాటించేలా, కోవిడ్‌ నిబంధనలపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిం చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ధన్‌రాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, డాక్టర్లు దేవేందర్‌రెడ్డి, అవినాష్‌, శ్రీకాంత్‌, తహసీల్దార్లు సుభాష్‌, ఆరిఫా, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి

నిర్మల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 15 : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలున్నాయని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. విలేకరులతో గురువారం మాట్లాడుతూ ప్రతిరోజూ రాపిడ్‌, యాంటిజెన్‌ టెస్టులు రెండు వేలు 150 ఆర్టీపీసీ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. రోజు ఐదు వేల మందికి మొ దటిడోస్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నామని, ఇప్పటి వరకు 57 వేల మందికి ఆరు వేల వరకు రెండోడోస్‌ వేసినట్లు తెలిపారు. వైరస్‌విస్తృతి దృష్ట్యా ప్రభుత్వ ఆసు పత్రిలో 107 పడకలు ఏర్పాటు చేశామని, 20 ఐసీయూ బెడ్లు, మూడు వెంటి లెటర్‌ బెడ్లు, 65 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని వివరించారు. వైద్యం కోసం 56 ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో 107 పడకలతో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొ న్నారు. ప్రజలు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రపర్చుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు. అవసరమైతే తప్ప సమూహాల్లోకి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. కరోనాపై విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి

సోన్‌, ఏప్రిల్‌ 15 : గ్రామాల్లో కోవిడ్‌ నివారణ వ్యాక్సినేషన్‌పై సిబ్బంది మరింత అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ పై ప్రజల్లో ఉన్న అపోహలను విడవటానికి చైతన్యం తీసుకురావాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. ఈ సందర్భంగా రోజుకు ఎంత మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నారని అడిగి తెలుసు కు న్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ధన్‌రాజ్‌, తహసీల్దార్‌ సుల్తానా, ఆరోగ్య కేంద్ర డాక్టర్‌ రమ్య, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-16T07:21:11+05:30 IST