భారీగా హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-03-27T07:29:59+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చకచక నిర్ణయాలు తీసుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో హ్యాండ్‌ శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉన్న ..

భారీగా హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తి

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చకచక నిర్ణయాలు తీసుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో హ్యాండ్‌ శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారీగా ఉత్పత్తి చేసేందుకు డిస్టిలరీలకు, చక్కెర మిల్లులకు లైసెన్సులిచ్చింది.  ఇప్పటికే 45 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చామని ప్రభుత్వం గురువారం తెలిపింది. రాష్ట్రాల్లో హ్యాండ్‌ శానిటైజర్ల కొరతను నివారించేందుకు, వాటి ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరాలో అవరోధాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరినట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్‌ అగర్వాల్‌ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో 55కిపైగా డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చే అవకాశం ఉందన్నారు.  

Updated Date - 2020-03-27T07:29:59+05:30 IST