కనిష్ఠ స్థాయికి కేసులు

ABN , First Publish Date - 2020-10-30T10:42:52+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా కనిష్ఠ స్థాయికి చేరుతోంది. గత వారం రోజులుగా వంద దాటుతున్న కేసుల సంఖ్య, గురువారం..

కనిష్ఠ స్థాయికి కేసులు

 ఉమ్మడి జిల్లాలో 98 కేసులు మాత్రమే నమోదు


మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/ గద్వాలక్రైం/ నాగర్‌కర్నూల్‌/ వనపర్తి/ నారాయణపేట క్రైం, అక్టోబరు 29 : 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా కనిష్ఠ స్థాయికి చేరుతోంది. గత వారం రోజులుగా వంద దాటుతున్న కేసుల సంఖ్య, గురువారం వంద లోపే నమోదయ్యింది. కేవలం 98 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకరు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. దేవరకద్ర మండలంలోని పేరూర్‌ గ్రామంలో 65 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 18 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ముగ్గురికి వైరస్‌ సోకింది. 

Updated Date - 2020-10-30T10:42:52+05:30 IST