మూడో రోజు 1,071మందికి టీకా

ABN , First Publish Date - 2021-01-19T06:26:19+05:30 IST

జిల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపికచేసిన 22 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు.

మూడో రోజు 1,071మందికి టీకా
ఒంగోలులో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

కొనసాగిన వ్యాక్సినేషన్‌ 

నేడు ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 18 : జిల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.  ఎంపికచేసిన 22 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. తొలి రెండురోజులు 1888 మందికి వ్యాక్సినేషన్‌ వేయగా, మూడోరోజైన సోమవారం 1,071 మందికి ఇచ్చారు. ఒక్కో కేంద్రానికి వంద మందిని పిలవగా కొన్నిచోట్ల వివిధ కారణాలతో పలువురు రాలేదు. కొత్త ప్రక్రియ కావడంతోపాటు టీకా వేసిన తర్వాత అరగంట పాటు పరిశీలనలో ఉంచాల్సి రావడంతో జాప్యం  జరుగుతోంది.   ఈనెల 20వతేదీ నాటికి తొలివిడత ప్రక్రియను పూర్తిచేసే విధంగా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేప ట్టారు. కొవిడ్‌ కట్టడికి తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రకటించిన 60 రోజుల కార్యక్రమం మంగళవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఒంగోలు లో సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి. రత్నావళి తెలిపారు. 


Updated Date - 2021-01-19T06:26:19+05:30 IST