రేపటిలోగా కొవిడ్‌ వ్యాక్సినేషన డ్రైవ్‌ చేపట్టాలి

ABN , First Publish Date - 2021-04-13T06:26:25+05:30 IST

టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 14వ తేదీలోగా జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు.

రేపటిలోగా కొవిడ్‌ వ్యాక్సినేషన డ్రైవ్‌ చేపట్టాలి

నేడు జిల్లాకు 45 వేల డోసుల రాక

టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి) : టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 14వ తేదీలోగా జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ వ్యాక్సినేషనపై అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మంగళవారం జిల్లాకు 45 వేల డోసుల వ్యాక్సిన  రానుందని ఆ మేరకు ఈ నెల 14వ తేదీన 45 వేల మందికి టీకా వేసేలా సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో 40 నుంచి 50 మందికి టీకా వేసేలా ప్రణాళిక రూపొందించుకొని లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. టీకా సరఫరా, సిబ్బంది నియామకం తదితర ఏర్పాట్లను వైద్యశాఖాధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు చేపట్టి బుధవారం 45 వేల మందికి వ్యాక్సిన వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఇప్పటి వర కూ మిగిలిపోయిన హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన వర్కర్లకు 100 శాతం వ్యాక్సిన వేయాలన్నారు. అందరూ వ్యాక్సిన వేయించుకున్నట్లు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖాధి కారులు ధ్రువపత్రాన్ని అందజేయాలన్నారు.  వ్యాక్సినేషన కార్యక్రమంపై కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించాలన్నారు. గంటకోసారి వ్యాక్సినేషన ప్రత్యేక డ్రైవ్‌పై నివేదిక అందజేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌లు నిశాంతకుమార్‌,  గంగాధర్‌ గౌడ్‌, డీఆర్వో గాయత్రీదేవి, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌, అడిషనల్‌ డీఎంహెచఓ సుబ్బారావు, జడ్పీ సీఈఓ శోభాస్వరూప రాణి, డీపీఓ పార్వతి, మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, ఆర్డీఓ మధుసూదన, డీఐఓ గంగాదర్‌ రెడ్డి, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నీరజ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


అనుమతి లేకుండా కరోనా బాధితులకు వైద్యమందిస్తే చర్యలు : కలెక్టర్‌ 

జిల్లాలో కరోనా బాధితులకు అనుమతి లేకుండా వైద్యం అందించే ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని  కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవా రం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు వైద్య సేవలందించేందుకు 8 ఆస్పత్రులను గుర్తించి అనుమతించామన్నారు. అందులో సుమారు 1003 పడకలు కొవిడ్‌ బాధితుల కోసమే కేటాయించామన్నారు. అనుమతి పొందిన ఆస్పత్రుల్లో హిందూపురం ప్రభుత్వాస్పత్రి, అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులు, అనంతపురం సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రి, సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రులున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో వైద్యం చేయిం చుకుంటే కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందిస్తారన్నారు. ఎవరైనా కరోనా బారిన పడితే ఈ ఆస్పత్రులకే వెళ్లాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. అనుమతుల్లేకుండా వైద్యమందించే ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-04-13T06:26:25+05:30 IST