‘లూప్ లపేటా’కు కరోనా బీమా

ABN , First Publish Date - 2020-07-10T18:10:14+05:30 IST

కరోనా... అన్ని రంగాలనూ వణికిస్తోంది. ఈ మహమ్మరి నేపధ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలో ఓ కొత్త కోణం చోటుచేసుకుంది. తాప్సి ప్రధానపాత్రలో నటించిన ‘లూప్ లపేటా’ చిత్రం బీమా చేయించుకోనుంది. ఇందుకు సంబంధించిన యత్నాలు మొదలయ్యాయి.

‘లూప్ లపేటా’కు కరోనా బీమా

ముంబై : కరోనా... అన్ని రంగాలనూ వణికిస్తోంది. ఈ మహమ్మరి నేపధ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలో ఓ కొత్త కోణం చోటుచేసుకుంది. తాప్సి ప్రధానపాత్రలో నటించిన ‘లూప్ లపేటా’ చిత్రం బీమా చేయించుకోనుంది. ఇందుకు సంబంధించిన యత్నాలు మొదలయ్యాయి.


చిత్ర నిర్మాత అతుల్ కస్బేకర్... కరోనా నుంచి తమ సినిమాను రక్షించుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు. న్యాయ నిపుణులతో ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ సఫలమైతే... కరోనా బీమా చేయించుకున్ని తొట్టతొలి భారతీయ చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయ్యింది. 

Updated Date - 2020-07-10T18:10:14+05:30 IST