55 వేలకు చేరువలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-23T10:20:24+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు 55 వేలకు చేరువయ్యాయి. గురువారం జిల్లాలో మరో 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

55 వేలకు చేరువలో కరోనా కేసులు

తాజాగా జిల్లాలో 171 పాజిటివ్‌ కేసులు

చికిత్స పొందుతూ మరొకరి మృతి

465కు చేరిన మొత్తం మరణాలు


విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు 55 వేలకు చేరువయ్యాయి. గురువారం జిల్లాలో మరో 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,987కు చేరాయి. గురువారం 175 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 52,250కి చేరింది. కాగా వివిధ ఆస్పత్రుల్లో మరో 2,272 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 465కు చేరాయి. కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తుందన్న వైద్యుల హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రచారం ప్రారంభించింది. 


సింహాచలంలో ఆరుగురికి..: 

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో గురువారం 98వ వార్డుకు చెందిన 55 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఆర్‌ఆర్‌వీ పురంలో ఒకరికి..: 

జీవీఎంసీ 69వ వార్డు వేపగుంట సమీపంలోని ఆర్‌ఆర్‌వీపురంలో గురువారం ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-23T10:20:24+05:30 IST