కరోనా ఎట్‌దిరేట్‌ 1,547

ABN , First Publish Date - 2020-09-06T09:12:30+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.

కరోనా ఎట్‌దిరేట్‌ 1,547

శనివారం ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు 

రంగారెడ్డి జిల్లాలో 810 కేసులు

మేడ్చల్‌లో 696, ముగ్గురి మృతి 

వికారాబాద్‌లో 41 మందికి వైరస్‌ వ్యాప్తి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1547 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా లో 810 పాజిటివ్‌లు, మేడ్చల్‌ జిల్లాలో 696 నమోదుకాగా, ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్‌ జిల్లాలో 41 మంది కరోనా బారిన పడ్డారు. మూడు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 58,411కు చేరుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో 46 కేసులు

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 338 మం దికి  పరీక్షలు చేయగా  46 మందికి పాజిటివ్‌ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురికి, ఆలూర్‌ పీహెచ్‌సీలో ముగ్గురికి, శంకర్‌పల్లిలో 22 మందికి, మొయినాబాద్‌లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. షాబాద్‌లో 12 మంది వైరస్‌ బారిన పడ్డారు. 


ఆమనగల్లులో 15, శంషాబాద్‌లో 14.. 

ఆమనగల్లు/శంషాబాద్‌: ఆమనగల్లు, మైసిగండి, వెల్దండ పీహెచ్‌సీల పరిధిలోని 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆమనగల్లుకు చెందిన 12 మంది, మైసిగండికి చెందిన ఇద్దరు, వెల్దండ మండలానికి చెందిన ఒకరు ఉన్నారు. శంషాబాద్‌లో 14 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. మొత్తం 74 మందికి పరీక్షలు చేసినట్లు వివరించారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 120..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని 11 కేంద్రాల్లో 626 మందికి కరోనా పరీక్షలు చేయగా 120 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీలో 21, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12,  దండుమైలారంలో ముగ్గురికి, ఎలిమినేడులో 13,  మంచాలలో 12, ఆరుట్లలో ఇద్దరికి, యాచారంలో 13, మాడ్గులలో 10, తట్టిఅన్నారంలో 4, రాగన్నగూడలో 16, హయత్‌నగర్‌ సీహెచ్‌సీలో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో 84 కేసులు 

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 381 మందికి కరోనా పరీక్షలు చేయగా 84 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన 19 మంది, ఫరూఖ్‌నగర్‌కు చెందిన 19 మంది, కేశంపేటకు చెందిన 20 మంది, నందిగామకు చెందిన 12 మంది ఉండగా మిగతా 14 మంది ఇతర మండలాలకు చెందిన వారున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో 41 పాజిటివ్‌ కేసులు 

 (ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/ధారూరు/ కులకచర్ల/పరిగి : వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం జిల్లాలో 41 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పరిగిలో 8, తాండూరులో 7, వికారాబాద్‌లో 7, పూడూరులో 4, ధారూరులో 3, మర్పల్లిలో 3, కొడంగల్‌లో 3, మోమిన్‌పేట, బంట్వారం, కులకచర్ల, పెద్దేముల్‌, బొంరా్‌సపేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు 1391 నమోదు కాగా, వాటిలో 582 యాక్టివ్‌ కేసులున్నాయి. 35 మంది ఆసుపత్రుల్లో, 547 మంది హోంకేర్‌లో వైద్యం పొందుతున్నారు. ఇప్పటివరకు 775 మంది రికవరీ కాగా, 34 మంది మృతి చెందారు. 


మేడ్చల్‌లో 26.. శామీర్‌పేటలో 13..

మేడ్చల్‌/శామీర్‌పేట : మేడ్చల్‌ ప్రభుత్వాసుత్రిలో 159 మందికి కరోనా పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. శామీర్‌పేట పీహెచ్‌సీలో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2020-09-06T09:12:30+05:30 IST