మాస్కు సామాజిక బాధ్యత: ఎస్పీ

ABN , First Publish Date - 2021-04-13T05:27:40+05:30 IST

మాస్కు ధరించడం ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని ఎస్పీ డా. ఫక్కీరప్ప కోరారు.

మాస్కు సామాజిక బాధ్యత: ఎస్పీ

  1. ఎమ్మిగనూరులో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ 


ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 12: మాస్కు ధరించడం ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని ఎస్పీ డా. ఫక్కీరప్ప కోరారు. సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో కొవిడ్‌-19, మాస్కు ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు.   ర్యాలీని ఎస్పీ డా. ఫక్కిరప్ప ప్రారంభించారు. సోమప్ప సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది లాక్‌డౌన్‌ ఉండిందని, మరోసారి లాక్‌డౌన్‌ రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేసిన 11మంది పోలీసులు గత ఏడాది కరోనాతో మృతి చెందారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారంత టీకా వేయించుకోవాలన్నారు. జరిమానా వేస్తున్నారని మాస్కులు పెట్టుకోవద్దని, బాధ్యతగా బావించాలని అన్నారు. అనంతరం మాస్కులు అందజేశారు. సీఐలు శ్రీనివాసనాయక్‌, మంజునాథ్‌, ఎస్‌ఐలు ప్రసాద్‌, రామసుబ్బయ్య, వెంకటరాముడు, జాహీర్‌ అహ్మద్‌, పీఈటీ రాజు, గిరి, పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:27:40+05:30 IST