కరోనాతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-01T04:02:22+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

కరోనాతో ఇద్దరి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో మృతుల సంఖ్య 195కు చేరుకుంది. అదేవిధంగా సోమవారం 170 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 73, వికారాబాద్‌ జిల్లాలో 14, మేడ్చల్‌ జిల్లాలో 83 కరోనా కేసులున్నాయి. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11కేంద్రాల్లో 319మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 11మందికి పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 1, దండుమైలారం 1, ఎలిమినేడు 1, హయత్‌నగర్‌ 5, తట్టి అన్నారంలో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది.


 చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌పరిధిలో 116 మందికి కరోనా పరీక్షలు చేయగా శంకర్‌పల్లి మండలానికి చెందిన ముగ్గురికి పాటిజివ్‌ వచ్చింది. చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదన్నారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో కరోనా కేసులు నిల్‌

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో రెండు రోజులుగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. సోమవారం షాద్‌నగర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రి, పీపీ యూనిట్‌తో పాటు బూర్గుల, చించోడ్‌, కొత్తూర్‌, కేశంపేట, కొందుర్గు, నందిగామ పీహెచ్‌సీలలో 160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగు తోంది. సోమవారం తాండూరులో 8, పూడూరులో 3, వికారాబాద్‌లో 2. నవాబుపేటలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 22 మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

Updated Date - 2020-12-01T04:02:22+05:30 IST