పాజిటివ్‌.. 2.27 శాతమే

ABN , First Publish Date - 2020-11-25T05:07:20+05:30 IST

జిల్లాలో కొత్తగా 126 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్‌.. 2.27 శాతమే

జిల్లాలో 126 మందికి కరోనా


గుంటూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 126 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన 5,556 శాంపిల్స్‌ ఫలితాల్లో కేవలం 2.27 శాతం మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. మిగతా 5,430(97.73 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చింది. కొత్తగా గుంటూరు నగరంలో 51, తెనాలిలో 10, బాపట్లలో 6, రేపల్లెలో 6, చుండూరులో 5, పెదకూరపాడులో 5 కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో మరో 43 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 73,923కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 72,190(97.65 శాతం) మంది కోలుకోగా ప్రస్తుతం 1,024 మంది చికిత్స పొందుతున్నారు. 709 మంది చనిపోయారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రతీ 10 లక్షల మందిలో 1,74,475 మందికి కరోనా పరీక్షలు చేశారు. మంగళవారం కూడా మరో 6,756 శాంపిల్స్‌ని టెస్టింగ్‌ నిమిత్తం సేకరించారు. 


Updated Date - 2020-11-25T05:07:20+05:30 IST