మగవాళ్లూ.. మీరు జాగ్రత్త

ABN , First Publish Date - 2020-08-07T11:42:52+05:30 IST

మీకు తెలుసా..? కరోనా బారిన పడుతున్న వారిలో మహిళలకంటే పురుషులే అత్యధికంగా ఉంటున్నా రని..! ఇది నిజం.

మగవాళ్లూ.. మీరు జాగ్రత్త

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా.. 

అధికంగా వైరస్‌ బారిన పురుషులు

అనారోగ్య సమస్యలు, దురలవాట్లే కారణం

కేసుల నమోదు, మరణాల రేటులో వీరే అధికం.. మహిళలపై ప్రభావం తక్కువ


ఏలూరు, ఆగస్టు(ఆంధ్రజ్యోతి): మీకు తెలుసా..? కరోనా బారిన పడుతున్న వారిలో మహిళలకంటే పురుషులే అత్యధికంగా ఉంటున్నా రని..! ఇది నిజం. ఒక్క మన జిల్లా లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇది వెల్లడైంది. కొవిడ్‌ కారణంగా పురు షులు 68 శాతం మంది మరణిస్తే.. మహిళలు 32 శాతమే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిం చింది. జిల్లాలో బుధవారం నాటికి 16,322 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 9,302 మంది (57.3 శాతం) పురుషులే కాగా.. మహిళలు మాత్రం 6,931 మంది (42.7 శాతం) మాత్రమే కొవిడ్‌కు గురయ్యారు. మరణాలను జయించడంతోనూ మహిళలదే పైచేయిగా కనిపిస్తోంది.


మరణించిన 215 మందికి గాను, 67 శాతం అంటే.. 145 మంది పురుషులు, 33 శాతం అంటే.. 70 మంది మహిళలు ఉన్నారు. అంటే స్త్రీలలో రిక వరీ రేటు పురుషులకంటే ఎక్కువగా ఉన్నట్లు గణాం కాలను బట్టి తెలుస్తోంది. పరిశోధకుల అంచనా ప్రకారం ఎక్కువ మంది పురుషులలో పొగ తాగే అలవాటు కార ణంగా శ్వాసకోశ సంబంధవ్యాధులు అధికంగా ఉంటా యని వైద్యాధికారులు చెబుతున్నారు. హృద్రోగ సంబంధ సమస్యలు ఎక్కువే. ఈ కారణాల రీత్యా.. పురుషులలో రికవరీ రేటు స్త్రీలకంటే తక్కువగా ఉంటున్నది. కొన్ని కారణాల వల్ల మహిళల్లో కొవిడ్‌ వ్యాప్తి తగ్గుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య పరిశోధన సంస్థ చెబుతోంది.


మహమ్మారి మహిళలకు తక్కువగా వ్యాపించడానికి కారణం మార్కెట్లు, కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా సంచరిస్తుంటారని, ఇంటి పని, వంట పని కారణంగా పరిశుభ్రత విషయంలోనూ మహిళలే ముందుంటారని, ఆ కారణంగా మహమ్మారి ప్రభావం వారిపై తక్కువగా ఉంటోందని అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.పురుషుల్లో పొగతాగే అలవాటు కారణంగా తడారిపోయిన పెదాలను పదే పదే నాలుకతో తడుపుకుంటుంటారని, ఆ కారణంగా వైరస్‌ సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తుందని, కాబట్టి ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండడమే మంచిదని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. 


కొత్తగా రెండు కేర్‌ సెంటర్లు 

ఏలూరు అర్బన్‌, ఆగస్టు 6 : జిల్లాలో కొత్తగా మరో రెండు కొవిడ్‌ సెంటర్లను ప్రారంభించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండడం, బాధితులకు చికిత్స అందించేందుకు ఇప్పుడున్న కేర్‌ సెంటర్లు చాలకపోవడం తదితర కారణాలతో కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పెనుగొండ వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో 250 పడకలతోనూ, మార్టేరు వ్యవసాయ కేంద్రంలో 150 పడకలతోనూ కొత్తగా కేర్‌ సెంటర్లను తెరవనున్నారు. వీటిని రాగల రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తారు. ఇకపై ఇక్కడి సెంటర్లకు సమీప ప్రాంతాల్లో నమోదయ్యే కరోనా లక్షణాలు లేని పాజిటివ్‌ బాధితులను తరలించి చికిత్స చేస్తారు. 


188 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు భర్తీ

కొవిడ్‌ కేసుల విజృంభణతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన వైద్య సిబ్బంది పోస్టులతో సహా, ప్రత్యేకంగా కొవిడ్‌ ఆసుపత్రులకు ఉద్దేశించిన స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. జిల్లాలో ఆయా పీహెచ్‌సీల పరిధిలో క్లియర్‌ వేకెన్సీలుగా వున్న 88 స్థానాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన, కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆరు నెలల కాల పరిమితికి లోబడి వంద స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేలకుపైగా దరఖాస్తులు అందాయి. మెరిట్‌ ప్రాతిపదికన రిజర్వేషన్‌ కం రోస్టర్‌ విధానం నిబంధనలను పాటిస్తూ అభ్యర్థుల వడపోత ఇప్పటికే పూర్తి కాగా, తుదిగా ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారంలోగా నియామకపు ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2020-08-07T11:42:52+05:30 IST