వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్
- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, జనవరి 24: సమస్యల పరిష్కా రంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తారని అటువంటి వారికి స్వాంతన కలిగించేదిగా అధికా రుల నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజావాణికి ఫిర్యా దులు రాకుండా ఉండాలంటే మండల స్థాయిలో అధి కారులు ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించా లని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించి తక్షణమే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు సూచించారు.