TS News: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-08-12T15:14:48+05:30 IST

నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది.

TS News: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద కారు బీభత్సం

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ (Peddamma temple) దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్ ఓపెన్ అవడంతో  ప్రాణాపాయం తప్పింది. మద్యం మత్తులో కార్ నడిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బీభత్సం సృష్టించిన కారు పోలీస్ స్టేషన్ తరలించారు. 

Updated Date - 2022-08-12T15:14:48+05:30 IST