మళ్లీ త్యాగం చేయలేం

ABN , First Publish Date - 2022-04-24T04:26:35+05:30 IST

గోనెగండ్లకు మూడు కి.మీల దూరంలో గాజులదిన్నె జలాశయం నిర్మించారు.

మళ్లీ త్యాగం చేయలేం
గాజులదిన్నె ప్రాజెక్టు వ్యూ

  1.  ఇప్పటికే భూములిచ్చి నష్టపోయాం
  2. ఈసారైనా సరైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి
  3. జీడీపీ సామర్థ్యం 5.5 టీఎంసీలకు పెంపు
  4. మరోసారి భూములు కోల్పోనున్న రైతులు
  5. ఒక టీఎంసీ పెరగడంతో 350 ఎకరాలకు ముంపు
  6. ఎకరాకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌
  7. రూ.4.50 లక్షలు ఇస్తామని అధికారుల ప్రతిపాదన
  8. సర్వేను అడ్డుకున్న అన్నదాతలు

గాజులదిన్నె జలాశయం - గోనెగండ్ల మధ్య సెంటు స్థలం రూ.5-10 లక్షల పైమాటే. ప్రధాన రహదారి పక్కనైతే రూ.20 లక్షలు పలుకుతోంది. అంటే.. ఎకరం సగటున రూ.5-10 కోట్ల పైమాటే. ఎక్కువ మంది ఎకరా రెండెకరాలు ఉన్న రైతులే ఉన్నారు. జీవనాధారమైన భూములు అమ్ముకోవడానికి ఏ రైతు కూడా ఆసక్తి చూపడం లేదు. గాజులదిన్నె జలాశయం సామర్థ్యం 5.5 టీఎంసీలకు పెంచేందుకు శంకుస్థాపన చేశారు. ఎత్తు పెంచితే ఐరనబండ, ఎన్నెకండ్ల గ్రామాల్లో 350 ఎకరాలు సాగు భూములు ముంపునకు గురవుతాయి.  అక్కడ ఎకరా రూ.25-30 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం రూ.4.50 లక్షలు ఇస్తానని అంటోంది. ఆ మొత్తానికి ఒకటి రెండు సెంట్ల  భూమి కూడా రాదు. న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.  


గాజులదిన్నె ప్రాజెక్టు కోసం భూములిచ్చి ఇప్పటికే నష్టపోయాం. ఉన్న ఎకరా.. అర ఎకరా భూముల్లో పంటలు సాగు చేసుకొని జీవిస్తున్నాం. ఇప్పుడు జీడీపీ ఎత్తు పెంచితే మళ్లీ మా భూములు మునిగిపోతాయి.  ఎకరాకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వకుంటే మేం బతికేదెట్లా? లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.

- ఇవీ జీడీపీ ఆయకట్టు రైతులు అధికారులను అడ్డుకొని 

చెప్పిన మాటలు


(కర్నూలు-ఆంధ్రజ్యోతి)/గోనెగండ్ల: గోనెగండ్లకు మూడు కి.మీల దూరంలో గాజులదిన్నె జలాశయం నిర్మించారు. సామర్థ్యం 4.5 టీఎంసీలు. గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి, గూడూరు, కోడుమూరు మండ లాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు సాగు నీరు, పలు గ్రామాలకు తాగునీరందించే ప్రధాన జలాశయం. జీడీపీ ద్వారానే డోన, కృష్ణగిరి, పత్తికొండ పట్టణాలకు తాగునీరు అందిస్తున్నారు. సుంకేసుల జలాశయం పూర్తి ఎండిపోయి, తుంగభద్ర నది పూర్తిగా ఒట్టిపో యిన పలు సందర్భాలలో కర్నూలు నగర ప్రజల కుగాజులదిన్నె ప్రాజెక్టు నుంచే తాగునీరు అందిం చారు. హంద్రీ నదితీరంలో కోడుమూరు పట్టణం సహా పలు గ్రామాలకు దాహం తీర్చే జలజీవని. ఎమ్మిగనూరు పట్టణానికి కూడా ఇక్కడి నుంచే తా గు నీరు అందించేందుకు పైపులైన నిర్మాణం చేప ట్టారు. కీలకమైన జీడీపీ సామర్థ్యాన్ని 5.50 టీఎంసీ లకు పెం చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.44 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల తో ఆనకట్ట ఎత్తు ఒక మీటరు పెంచడంతోపాటు ఐదు గేట్లకు మరమ్మతులు చేస్తారు. ఈ పనుల కు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. 

 350 ఎకరాల భూ సేకరణ

గాజులదిన్నె జలాశయం కాంటూర్‌ లెవల్‌ 377 మీటర్లు. ఒక టీఎంసీ నీటిని అదనంగా నిల్వ చేసేందుకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ 378 మీటర్లకు పెంచుతున్నారు. ఆనకట్ట ఎత్తు పెంచడంతో కాంటూర్‌ లెవల్‌ 378 మీటర్లు, అక్కడ నుంచి మరో 100 మీటర్ల వరకు భూ సేకరణ చేయాలి. ఎత్తు పెంచితే గోనేగండ్ల మండలం ఐరనబండ, ఎన్నెకండ్ల గ్రామాల పరిధిలో సుమారుగా 350 ఎకరాల సాగు భూములు ముంపునకు గురౌతున్నాయి. జలాశయం పక్కనే ఉండడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రైతులు బోరు బావులు తవ్వుకొని ఉల్లి, మిరప, పత్తి, వరి.. వంటి వాణిజ్య, ధాన్యం పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండించే భూములు అవి. అంతేకాదు.. గోనెగండ్ల పట్టణానికి, ఎమ్మిగనూరు-కర్నూలు ప్రధాన రహదారికి దగ్గర్లో ఉండడం, మెజార్టీగా ఎకరా, రెండెకరాలు, మూడెకరాలు సాగు భూములు కలిగిన సన్న, చిన్నకారు రైతులే కావడంతో ఆ భూమి అమ్మితే జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.

  రూ.35-40 లక్షల పరిహారం ఇవ్వాలి

ఐరనబండ, ఎన్నెకండ్ల గ్రామాల్లో భూములకు భారీగా డిమాండ్‌ ఉంది. బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ కాదన్నా ఎకరం రూ.25-30 లక్షలకు పైగా పలుకుతోంది. జలాశయం సామర్థ్యం పెంచుతామం టే స్వాగతిస్తామని, ఆ పేరుతో తమ కడుపులు కొడతామంటే ఎలా అని రైతులు ప్రస్తున్నారు.  ఎక రాకు రూ.35-40 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు న్నారు. భూ సేకరణ చట్టం (ఎల్‌ఏ)- 2013 ప్రకారం పరిహారం తేల్చకుండా మంత్రులు శంకుస్థాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని మండలం ఆరేకల్లు సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇచ్చి భూ సేకరణ చేశారు. అక్కడో న్యాయం.. ఇక్క డో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగం గానే ఇటీవల సర్వే కోసం వచ్చిన అధికారులను  అడ్డుకొని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. 

 ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి 

ప్రాజెక్టుల నిర్మాణాల్లో భూములు, ఊళ్లు కోల్పోయే రైతుల కుటుంబాల్లో అర్హతను బట్టి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జీవో నం.98 తీసుకు వచ్చారు. శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు ఈ జీవో ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు. జీడీపీ ఎత్తు పెంచితే మా పొలాలు మునిగిపోతాయి. న్యాయమైన భూ పరిహారంతోపాటు జీవో నంబరు.98 ప్రకరాం ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. 

-  ప్రభాకర్‌రెడ్డి, రైతు ఎన్నెకండ్ల 

 

భూ సేకరణ చట్టం-2013 పక్కాగా అమలు చేయాలి 

గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే మూడు వేల ఎకరాలు కోల్పోయాం. మిగిలిన ఎకరా రెండె కరాల్లో బోరుబావులు తవ్వుకొని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు జలాశయం ఎత్తు పెంచుతామంటే జీవనాధారం కోల్పోతాం. ఇక్కడ ఎకరా రూ.25-30 లక్షల కు పైగా ఉంది. అధికారుల రూ.4.50 లక్షలు ఇస్తామం టున్నారు. ఇదెక్కడి న్యాయం..? భూ సేకరణ చట్టం- 2013 పక్కాగా అమలు చేసి న్యాయమైన పరిహారం ఇవ్వాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం. 

- నజీర్‌సాహెబ్‌, రైతు ఐరనబండ, గోనెగండ్ల మండలం


 ఎకరాకు రూ.35-40 లక్షలు ఇవ్వాలి 

మేము ఐదుగురం అన్నదమ్ములం. మాకు 12 ఎకరాల భూమి ఉంది. గాజులదిన్నె జలాశయం ఎత్తు పెంచితే తొమ్మిది ఎకరాలు ముంపునకు గురవుతుంది. మిగిలిన మూడు ఎకరాలతో మేం ఎలా బతకాలి. ఇక్కడ ఎకరా రూ.25-35 లక్షలు పైగా పలుకుతోంది. సబ్‌ రిజిసే్ట్రషన విలువతో సబంధం లేకుండా ఎల్‌ఏ చట్టం-2013 ప్రకారం ఎకరాకు రూ.35-40 లక్షలు ఇవ్వాలి. లేదంటే మా భూములు ఇవ్వం. ఇప్పటికే ప్రాజెక్టు కోసం చాలా త్యాగం చేశాం. మళ్లీ త్యాగం లేయంలేం.

- గుడిసె గోపాల్‌ , రైతు ఐరనబండ


 ఆత్మహత్యలే శరణ్యం 

మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంటే ఇప్పటికే జీడీపీ నిర్మాణంలో ఆరు ఎకరాలు కోల్పోయాం. మిగిలిన రెండెకరాలే మిగిలింది. ఇక ఆ భూమే మాకు జీవనాధారం. ఇప్పుడు ఆ భూమిని కూడా తీసుకుంటామని అధికారులు చెబుతు న్నారు. ప్రాజెక్టుకు భూములు ఇవ్వమని అనడం లేదు. మా గ్రామాల్లోనే భూమికి భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. లేదంటే ఎకరాకు రూ.35 లక్షల పరిహారం ఇచ్చి న్యాయం చేయాలి. లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. 

-  ఉప్పరి నాగరాజు, రైతు ఎన్నెకండ్ల

 న్యాయమైన పరిహారం ఇవ్వాలి  

భూ సేకరణ చట్టం-2013 ప్రకారం ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ చేయాల్సి వస్తే ముంపు గ్రామాల రైతులతో అవగాహన సదస్సులు పెట్టాలి. రైతులు ఎకరానికి ఎంత పరిహారం డిమాండ్‌ చేస్తున్నారో ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపాలి. అలాంటిదేమి లేకుండా.. మా గ్రామాలకు ఒక్క అధికారి కూడా రాకుండా జీడీపీ ఎత్తు పెంచుతు న్నామంటూ ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఇది న్యాయమేనా..?

-  రాజశేఖర్‌రెడ్డి, రైతు, ఎన్నెకండ్ల




Updated Date - 2022-04-24T04:26:35+05:30 IST