గంజాయి ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-10-25T04:14:56+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గంజాయిని సాగుచేసి జగిత్యా లలో విక్రయిస్తున్న ముఠాగుట్టును జగిత్యాల పోలీ సులు రట్టు చేశారు. గంజాయిని సాగుచేస్తున్న వ్యక్తితో పాటు, రవాణాచేస్తున్న వ్యక్తులను అరెస్టుచేసి, వారినుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు.

గంజాయి ముఠా గుట్టురట్టు
మాట్లాడుతున్న డీఎస్పీ ప్రకాశ్‌

- జిల్లాలో సాగు చేసి జగిత్యాల జిల్లాకు రవాణా 

- సాగు చేస్తున్న వ్యక్తితో పాటు రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్టు 

- నిందితుల నుంచి గంజాయి మొక్కలు, మూడు బైకులు స్వాధీనం

- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాశ్‌ 

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 24: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గంజాయిని సాగుచేసి జగిత్యా లలో విక్రయిస్తున్న ముఠాగుట్టును జగిత్యాల పోలీ సులు రట్టు చేశారు. గంజాయిని సాగుచేస్తున్న వ్యక్తితో పాటు, రవాణాచేస్తున్న వ్యక్తులను అరెస్టుచేసి, వారినుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. జగిత్యాలటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆదివారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో డీఎస్పీ ప్రకాశ్‌ వివరాలు వెల్ల డించారు. జగిత్యాల టౌన్‌ సీఐ కిశోర్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 28న కొత్త బస్టాండ్‌ చౌరస్తా సమీపంలో ఓ షాపింగ్‌మాల్‌ ఎదుట వాహనాలను తనిఖీ చేస్తు న్నారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగు తున్న ఇద్దరు వ్యక్తులను ఆపారు. వారిని తనిఖీ చేయగా సుమారు 250గ్రాముల గంజాయి లభిం చింది. తనిఖీ చేస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా, జిల్లా కేంద్రానికి చెందిన మేకలరాజు అలియాస్‌ కిన్నె రగా తేలింది. మేకల రాజును మరింత లోతుగా విచా రించగా, జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఆరుముల్ల సాయి అలియాస్‌ చేపల సాయి కుమార్‌ అతని స్నేహితుడు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. స్నేహితులైన మేకలరాజు, సాయికుమార్‌ మొదట గంజాయి సేవించడానికి అలవాటు పడ్డారు. ఆ తర్వాత ఆసిఫాబాద్‌, ఆదిలా బాద్‌ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని వారి స్నేహితులకు విక్రయించేవారు. 28న పట్టుబడ్డ రాజుతోపాటు, పారిపోయిన సాయికుమా ర్‌పై కేసు నమోదు చేసి అదేరోజు రాజును రిమాం డ్‌కు  పంపించారు.

 పరారీలో ఉన్న సాయికుమార్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌ మండలం మోతిగూడ గ్రామంలో ఉన్నాడనే సమాచారం మేరకు టౌన్‌ సీఐ కిషోర్‌ తన సిబ్బందితో వచ్చి పట్టుకున్నారు. సాయి కుమార్‌ను పోలీసులు విచారించగా మోతిగూడ గ్రామానికి చెందిన మాడావి చందు గంజాయి సాగు చేసి, తమకు అందజేస్తాడని పేర్కొన్నారు. రాజుతో కలిసి ఆ గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి జగిత్యాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల యువ కులకు విక్రయిస్తామని తెలిపారు. సీఐ కిషోర్‌, సిబ్బంది లింగాపూర్‌ డిప్యూటీ తహశీల్దార్‌తో కలిసి చందు సాగుచేస్తున్న గంజాయి తోటకు వెళ్లారు. చందు సాగు చేసిన గంజాయి మొక్కలను డిప్యూటీ తహశీల్దార్‌ సమక్షంలో ధ్వంసం చేశారు. నాలుగు మొక్కలను స్వాధీనం చేసుకుని పంచనామా చేశారు. 

గంజాయి సాగు చేస్తున్న చందుతోపాటు, సరఫరా చేస్తున్న సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ ప్రకాశ్‌ వివరించారు. గంజాయి సాగు చేస్తున్న చందు ఒక్కో గంజాయి మొక్కను రూ.5వేలకు విక్రయిస్తాడన్నారు. డిమాండ్‌ మేరకు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతాడని తమ విచారణలో తేలిందన్నారు. ఇద్దరు వ్యక్తులతో పాటు సాయికుమార్‌ దొంగిలించిన మూడు ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి మూలాల వరకు వెళ్లి, గంజాయి ముఠా గుట్టును రట్టు చేసిన టౌన్‌ సీఐ కిషోర్‌, సిబ్బందిని డీఎస్పీ ప్రకాశ్‌ అభినందించారు.

Updated Date - 2021-10-25T04:14:56+05:30 IST