Cancellation of trains: చెన్నై బీచ్‌ - తాంబరం మధ్య పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-09-18T16:38:26+05:30 IST

స్థానిక తాంబరం యార్డ్‌ వద్ద రైల్వేలైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 18వ తేదీ పలు ఈఎంయూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణరైల్వే శనివారం ఓ

Cancellation of trains: చెన్నై బీచ్‌ - తాంబరం మధ్య పలు రైళ్ల రద్దు

చెన్నై, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక తాంబరం యార్డ్‌ వద్ద రైల్వేలైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 18వ తేదీ పలు ఈఎంయూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణరైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం కూడా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం కూడా మరికొన్ని రైళ్లను రద్దు చేయనున్నారు. రద్దయిన రైళ్ల వివరాలిలా ...

- శనివారం రాత్రి 11.59 గంటలకు చెన్నై బీచ్‌ నుంచి తాంబరం బయలుదేరాల్సిన ఈఎంయూ (40149), రాత్రి 11.45 గంటలకు తాంబరం నుంచి చెన్నై బీచ్‌కు బయలుదేరాల్సిన ఈఎంయూ (40150) పూర్తిగా రద్దయ్యాయి.

- ఆదివారం రాత్రి 11.59 గంటలకు చెన్నై బీచ్‌ నుంచి తాంబరం బయలుదేరాల్సిన ఈఎంయూ (40419), రాత్రి 11.25 గంటలకు తాంబరం నుంచి చెన్నై బీచ్‌ బయలుదేరాల్సిన ఈఎంయూ (40420)లను పూర్తిగా రద్దయ్యాయి.


Updated Date - 2022-09-18T16:38:26+05:30 IST