డెప్యుటేషన రద్దు బేఖాతరు

ABN , First Publish Date - 2022-07-01T06:03:02+05:30 IST

అడిగేవారు లేకుంటే అడ్డగోలు తనానికి అడ్డే ఉండదు. జిల్లా పరిషత్‌లో ఇదే జరుగుతోంది. ఇష్టారాజ్యంగా ఉద్యోగులను డెప్యుటేషన వేస్తారు

డెప్యుటేషన రద్దు బేఖాతరు

జడ్పీ సీఈఓ ఉత్తర్వులు తూచ

చోద్యం చూసిన ఉన్నతాధికారి


అనంతపురం విద్య, జూన్‌ 30: అడిగేవారు లేకుంటే అడ్డగోలు తనానికి అడ్డే ఉండదు. జిల్లా పరిషత్‌లో ఇదే జరుగుతోంది. ఇష్టారాజ్యంగా ఉద్యోగులను డెప్యుటేషన వేస్తారు. ఆ తరువాత రద్దు చేస్తారు. సీఈఓ డెప్యుటేషన్‌రద్దు చేసినా.. కొందరు పాత స్థానాలకు వెళ్లరు. ఆయన కళ్ల ముందే తిరుగుతూ కనిపిస్తారు. జడ్పీ కార్యాలయం ఒక్కటే కాదు, జడ్పీ పరిధిలోని ఎంపీడీఓ ఆఫీ సులు, జడ్పీ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. జూన 19న డెప్యుటేషన రద్దు ఉత్తర్వులిస్తే.. 90 శాతం అధికారులు, సిబ్బంది 30వ తేదీ వరకూ పాత స్థానాల్లోనే  కొనసాగారు. 

జడ్పీలో అధికం..

అడ్మినిసే్ట్రటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెం ట్‌, టైపిస్టులు, రికార్టు అసిస్టెంట్‌... ఇలా చాలామందిని డెప్యుటేషనపై పంపారు. ఏ శాఖలో లేనంతగా జడ్పీ పరిధిలో భారీగా డెప్యుటేషన్లు వేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దకు, జడ్పీ, ఎంపీడీఓ ఆఫీసులు, జడ్పీ స్కూళ్లకు నియ మించారు. జడ్పీ ఆఫీస్‌ పరిధిలో 18 మందిని, ఎంపీడీఓ, పంచా యతీరాజ్‌ సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలకు, జడ్పీ స్కూళ్లకు 33 మందిని నియమించారు. ఏకంగా 51 మందిని డెప్యుటేషన వేసేశారు. ఈ స్థాయిలో మరే శాఖలోనూ డెప్యుటేషన్లు ఉండవు.

19న రద్దు చేసినా..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు జూన్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న బాన్‌ను ఎత్తివేసింది. మొదట్లో గత నెల 17లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సాధారణ బదిలీల కంటే ముందే.. డెప్యుటేషన్లను రద్దు చేసి, యథాస్థానాలకు పంపాల్సి ఉంది. కానీ ఈ నెల 17 వరకూ డిప్యూటేషన్లు రద్దు చేయలేదు. ఇంతలో ఉన్నఫలంగా ప్రభుత్వం 122 జీవో ఇచ్చి.. జూన్‌ 30 వరకూ బదిలీలకు అవకాశం ఇచ్చింది. దీంతో తీరిగ్గా.. గత నెల 19న డెప్యుటేషన్లను రద్దు చేశారు. జడ్పీ ఆఫీస్‌లో డిప్యూటేషన్‌పై ఉన్న వారికి మాత్రం జూన్‌ 29 వరకు అవకాశం ఇచ్చారు. మిగిలిన 33 మందిని వెంటనే రిజినల్‌ ప్లేసుల్లో రిపోర్టు చేసుకోవాలని సీఈఓ ఆదేశించారు. కానీ  సీఈఓ ఉత్తర్వులను ఖాతరు చేయలేదు. చివరి రోజు వరకూ అక్కడే సేద తీరారు. జూన్‌  19న డెప్యుటే షన్లను రద్దు చేసినందున.. వెంటనే వారంతా పాత స్థానాలకు వెళ్లి విధుల్లో చేరాలి. కానీ జడ్పీ ఉన్నతాధికారి వైఖరి వల్ల అందరూ డెప్యుటేషన స్థానాల్లోనే కొనసాగారు. ఈ తీరు విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారి ఉత్తర్వులను కింది స్థాయి సిబ్బందే ఖాతరు చేయకపోతే.. ఇక పాలక ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు పెదవి విరుస్తున్నారు. 


Updated Date - 2022-07-01T06:03:02+05:30 IST