Abn logo
May 14 2021 @ 07:57AM

ప్రయాణికులు లేక 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

చెన్నై/పెరంబూర్: ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కోయంబత్తూర్‌-నాగర్‌కోయిల్‌ సహా 8 రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది.

ఆ వివరాలు...

మైలాడుదురై-కోయంబతూర్‌ (నెం.02083), కోయంబత్తూర్‌-మైలాడుదురై (02084) రైళ్లు శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు.

చెన్నై సెంట్రల్‌-మంగళూరు (02685), మంగళూరు-చెన్నై సెంట్రల్‌ (02686) దినసరి రైళ్లు ఈ నెల 15 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రద్దు.

నాగర్‌కోయిల్‌-కోయంబత్తూర్‌ (నెం.06321), కోయంబత్తూర్‌-నాగర్‌కోయిల్‌ (నెం.06322) రైళ్లు శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు.

కోయంబత్తూర్‌-మంగళూరు (నెం.06323), మంగళూరు-కోయంబత్తూర్‌ (నెం.06324) దినసరి రైళ్లు శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు.

Advertisement
Advertisement
Advertisement