అనంతలక్ష్మి కళాశాలలో ప్రాంగణ నియామకాలు

ABN , First Publish Date - 2020-02-17T06:56:29+05:30 IST

నగర శివారులోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం చెన్నైకు చెందిన హెచ్‌వైఓఎ్‌సఈఓఎన్‌జీ ఎలక్ర్టికల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. బీటెక్‌ చివరి సంవత్సరం ఈఈఈ, మెకానికల్‌

అనంతలక్ష్మి కళాశాలలో ప్రాంగణ నియామకాలు

జేఎన్‌టీయూ, ఫిబ్రవరి 16 : నగర శివారులోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం చెన్నైకు చెందిన హెచ్‌వైఓఎ్‌సఈఓఎన్‌జీ ఎలక్ర్టికల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. బీటెక్‌ చివరి సంవత్సరం ఈఈఈ, మెకానికల్‌ విద్యార్థులు 150 మంది నియామకాలకు హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ మూర్తిరావు తెలిపారు. కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నరసింహ్‌ నియామక ప్రక్రియ చేపట్టారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రతిభ కలిగిన 35 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి రూ.3 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీ ఇవ్వనుంది. ఇప్పటివరకు కళాశాలలో జరిగిన ప్రాంగణ నియామకాలలో 403 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రాంగణ నియామకాల నైపుణ్యాభివృద్ధి డైరెక్టర్‌ సురేంద్రనాయుడు పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ అనంతరాముడు, వైస్‌ చైర్మన్‌ రమే్‌షనాయుడు, ప్రిన్సిపాల్‌ మూర్తిరావు అభినందించారు.

Updated Date - 2020-02-17T06:56:29+05:30 IST