Advertisement
Advertisement
Abn logo
Advertisement

75లక్షల పోస్టుకార్డులతో ప్రచారం

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 3: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75లక్షల పోస్టుకార్డులతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మదనపల్లె పోస్టాఫీసు ఏఎస్పీ కె.విద్యావతి తెలిపారు. డిసెంబరు 1 నుంచి 20వ తేది వరకు అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల విద్యార్థులు పోస్టుకార్డుపై దేశ ప్రధానికి లేఖలు రాస్తారన్నారు.  స్వాతంత్య్ర సమరయోధులు, 2047 సంవత్సరానికి దేశం ఎలా ఉండాలి అనే అంశాలపై విద్యార్థులు పంపించాల్సి ఉందన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి పది ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి, మొత్తం 75 మందిని 2022 జనవరి 17న ప్రశంసిస్తారన్నారు. ఈ విషయాన్ని మదనపల్లె డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని విద్యావతి తెలిపారు.

Advertisement
Advertisement