ప్రశాంతంగా

ABN , First Publish Date - 2020-12-06T05:16:47+05:30 IST

ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో చంద్రకళ తెలిపారు. పెద్దపాడులోని ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. నరసన్నపేట పట్టణంలోని బోర్డు పాఠశాల, మడపాం ఉన్నత పాఠశాలల్లోనూ పరిశీలించారు.

ప్రశాంతంగా
పెద్దపాడులో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో చంద్రకళ

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

97.6 శాతం హాజరు 

(గుజరాతీపేట, డిసెంబరు 5)

ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో చంద్రకళ తెలిపారు. పెద్దపాడులోని ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. నరసన్నపేట పట్టణంలోని బోర్డు పాఠశాల, మడపాం ఉన్నత పాఠశాలల్లోనూ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జిల్లాలో 60 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాం. మొత్తం 6,785 మంది విద్యార్థులకుగానూ 6,623 మంది(97.6 శాతం) హాజరయ్యారు. 162 మంది గైర్హాజరయ్యారు’ అని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా.. కేంద్రాల వద్ద ముందస్తుగా శానిటైజేషన్‌ చేపట్టామన్నారు. విద్యార్థులకు థర్మల్‌ పరీక్ష చేసి కేంద్రాల్లోకి అనుమతించామని తెలిపారు. అరసవల్లి, గుజరాతీపేట ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు పరిశీలించారు.  కార్యక్రమంలో ఎంఈవో ఉప్పాడ శాంతారావు, హెచ్‌ఎం నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-06T05:16:47+05:30 IST