కేబుల్‌ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-02-27T07:10:54+05:30 IST

ముఖ్యమంత్రిని కలసి సమస్యలు చెప్పుకోవాలని విజయవాడ వెళితే పోలీసులు అన్యాయంగా తమను అరెస్టు చేశారని, తామేమీ తీవ్రవాదులం, నక్సలైట్లం కాదని ఆంధ్రప్రదేశ్‌ కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ చైౖర్మన్‌ పసలపూ డి సీతారామయ్య, కన్వీనర్‌ ఉప్పులూరి జానకిరామయ్య అన్నారు.

కేబుల్‌ ఆపరేటర్లను  ప్రభుత్వం ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సీతారామయ్య

 సమస్యలు చెప్పుకోవడానికి వెళితే అరెస్టులా

 న్యూస్‌ ఛానల్స్‌ పునరుద్ధరించాలి, జెమినీ ప్యాకేజీ ఇవ్వాలి : కేబుల్‌ ఆపరేటర్ల సంఘం 

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 26 : ముఖ్యమంత్రిని కలసి సమస్యలు చెప్పుకోవాలని విజయవాడ వెళితే పోలీసులు అన్యాయంగా తమను అరెస్టు చేశారని, తామేమీ తీవ్రవాదులం, నక్సలైట్లం కాదని ఆంధ్రప్రదేశ్‌ కేబుల్‌ ఆపరేటర్ల జేఏసీ చైౖర్మన్‌ పసలపూ డి సీతారామయ్య, కన్వీనర్‌ ఉప్పులూరి జానకిరామయ్య అన్నారు. కేబుల్‌ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిలిపివేసిన న్యూస్‌ ఛానల్స్‌తోపాటు జెమిని ప్యాకేజీ మొత్తం పునరుద్ధరించాలన్నారు. ముఖ్యమంత్రిని కలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను వద్దకు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని, గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. దీంతో తామే నేరుగా సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్ట్‌లు చేశారన్నారు. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ కారణంగా రాష్ట్రంలోని 13 జిల్లాల కేబుల్‌ ఆపరేటర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కేబుల్‌ కనెక్షన్‌ ధర రూ.300కు పెంచి ఆపరేటర్ల కమీషన్‌ తగ్గించారని, ఓఎల్‌టీలు, బాక్సులు ఇవ్వకపోవడంతో సాంకేతిక సమస్యలు ఎదు ర్కొంటున్నామని, ప్రిపెయిడ్‌ విధానంలో లోపాలున్నాయ న్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు శీలం     సత్యనారాయణ, పుట్టా వెంకటగోవింద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T07:10:54+05:30 IST