‘కనీస మద్దతు ధర’ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం!

ABN , First Publish Date - 2020-09-21T23:08:57+05:30 IST

దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ‘కనీస మద్దతు ధర’ ను

‘కనీస మద్దతు ధర’ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం!

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘కనీస మద్దతు ధర’ ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో 2021-22 రబీ సీజన్ కు పండే పంటల కనీస మద్దతు ధర’ ను పెంచాలని కేంద్ర డిసైడ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరి కాసేపట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.


గోధుమ, బార్లీ, గ్రామ్, రాప్‌సీడ్, ఆవాలు, కుసుమ పంటలు ఆ జాబితాలో ఉన్నాయి. కొత్త చట్టాల కారణంగా కనీస మద్దతు ధరకు ఏమాత్రం ఢోకా ఉండదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-21T23:08:57+05:30 IST