దుర్గగుడి దసరా హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2020-11-01T10:35:22+05:30 IST

దసరా ఉత్సవాల్లో కనకదుర్గమ్మ దేవస్థానానికి హుండీల ద్వారా మొత్తం 3,10,46,604 ఆదాయం లభించింది.

దుర్గగుడి దసరా హుండీ ఆదాయం

రూ.3,10,46,604


విజయవాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : దసరా ఉత్సవాల్లో కనకదుర్గమ్మ దేవస్థానానికి హుండీల ద్వారా మొత్తం 3,10,46,604 ఆదాయం లభించింది. 415 గ్రాముల బంగారం, 6,480 గ్రాముల వెండి వస్తువులు కూడా లభించాయి. గతనెల 17 నుంచి 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి హుండీల్లో కానుకలుగా సమర్పించిన ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ శనివారం ముగిసింది. తొలిరోజు గురువారం 10 హుండీల్లోని కానుకలను లెక్కించగా రూ.1,75,49,853తో పాటు 300 గ్రాముల బంగారం, 3,480 గ్రాముల వెండి వస్తువులు లభించాయి. శనివారం 39 హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించగా, రూ.1,34,96,751తో పాటు 115 గ్రాముల బంగారం, 3వేల గ్రాముల వెండి వస్తువులు లభించాయి. మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన ఈ హుండీల లెక్కింపు ప్రక్రియను ఈవో ఎంవీ సురేష్‌బాబు పర్యవేక్షించారు. 

Updated Date - 2020-11-01T10:35:22+05:30 IST