మచిలీపట్నం కార్పొరేషన్‌ టీపీవోపై ఏసీబీ ఆకస్మిక దాడి

ABN , First Publish Date - 2020-10-28T10:22:19+05:30 IST

మచిలీపట్నం నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు జరిపారు. ఏడుగురు అధికారులు, సిబ్బంది వద్ద నిబంధనలకు మించి ఉన్న రూ.16వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

మచిలీపట్నం కార్పొరేషన్‌ టీపీవోపై ఏసీబీ ఆకస్మిక దాడి

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 27 : మచిలీపట్నం నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు జరిపారు. ఏడుగురు అధికారులు, సిబ్బంది వద్ద నిబంధనలకు మించి ఉన్న రూ.16వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఏఎస్పీ కె.మహేశ్వరరాజు, డీఎస్పీ పి.శరత్‌బాబు, సీఐ శివకుమార్‌, ఎస్సై నాంచారయ్య ఈ దాడులు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రికార్డులను పరిశీలించారు. నగరంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇచ్చిన వనాల వివరాలను సేకరించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ శివరామకృష్ణ, టౌన్‌ ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని విచారించారు. రికార్డులను పరిశీలించారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శరత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.


ఏడుగురి నుంచి రూ.16వేలు స్వాధీనం 

నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని డీఎస్పీ శరత్‌బాబాబు పేర్కొన్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామన్నారు.

Updated Date - 2020-10-28T10:22:19+05:30 IST