Advertisement
Advertisement
Abn logo
Advertisement

బైపాస్‌కు సర్వీసు రోడ్డు నిర్మించాలి

విజయవాడ రూరల్‌/ గన్నవరం, డిసెంబరు 7 : చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు నిర్మిస్తున్న ఆరు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌) బైపాస్‌కు సర్వీసు రోడ్డును నిర్మించాలని  ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్‌ కోరారు.  ఈ మేరకు ఆయన గన్నవరం నియోజకవర్గంలోని  రైతులతో కలిసి మంగళవారం విజయవాడలో  కలెక్టర్‌ జె నివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బైపాస్‌కు సర్వీసు రోడ్డు ఎంత ముఖ్యమో వివరించారు. బైపాస్‌కు భూ సేకరణ సమయంలో రైతులతో నిర్వహించినన సమావేశంలో సర్వీసు రోడ్డు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చినఅవుటపల్లి, బీబీ గూడెం, ముస్తాబాద, సూరంపల్లి, నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, గొల్లపూడి వరకు సర్వీసు రోడ్డు ఉండాలన్నారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో చర్చించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో విజయవాడ రూరల్‌ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, పోలారెడ్డి చంద్రారెడ్డి, కలకోటి బ్రహ్మానందరెడ్డి, దేవగిరి ఓంకార్‌రెడ్డి, మేడసాని శ్రీనివాస్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement