Abn logo
Jul 25 2021 @ 10:16AM

తన స్కూల్ బ్యాండ్ ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక అంశాలకు సంబంధించిన ఫొటోలతో పాటు తన అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు. ఇటువంటి పోస్టుల కారణంగా ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుంటుంది. 

తాజాగా ఆయన తన చిన్ననాటి ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్రా గిటార్ వాయిస్తూ కనిపిస్తున్నారు.  బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోకు క్యాప్షన్‌గా అది... ‘ది బ్లాక్‌జాక్’ అనే స్కూల్ బ్యాండ్‌లో భాగమని రాశారు. ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్రాతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు.

ప్రత్యేకంమరిన్ని...